అద్భుతమైన మరకత శివలింగ దర్శనం | MARAKATA SHIVA LINGAM (CHANDIPPA) SHANKARAPALLI HYDERABAD

Описание к видео అద్భుతమైన మరకత శివలింగ దర్శనం | MARAKATA SHIVA LINGAM (CHANDIPPA) SHANKARAPALLI HYDERABAD

మరకత శివలింగ దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, చందిప్ప గ్రామంలో ఉన్న దేవాలయం. మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథుడిని పోలిన బ్రహ్మసూత్రం కలిగిన ఈ మరకత శివలింగానికి శతాబ్దాల చరిత్ర ఉంది. మూసీనది (ముచుకుందానది) ఒడ్డునున్న ఈ దేవాలయంలోని మరకత సోమేశ్వర లింగాన్ని పూజిస్తే వ్యాధులు నయమవుతాయిని, సకల ఐశ్వర్యాలు వస్తాయని భక్తుల నమ్మకం.
ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న మరకత లింగం కొలువై ఉన్న ఈ దేవాలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. సామాన్య శకం 1076-1126 మధ్య పశ్చిమ చాళుక్య రాజు చక్రవర్తి శ్రీత్రిభువన మల్లబిరుదాంకింతుడైన ఆరో విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని, క్రీ.శ.1101 సంవత్సరం కార్తిక శుద్ధ పంచమి గురువారం నాడు ప్రతిష్ఠ ఉత్సవం జరిగిందని ఇక్కడి శాసనం ద్వారా తెలుస్తోంది. దేవాలయ ప్రాంగణంలో వెలిసన క్షేత్ర పాలకుడైన కాలభైరవుడు ఈ దేవాలయాన్ని రక్షిస్తున్నాడు. ఆదివారం కాలభైరవుడిని పూజిస్తే సమస్త గ్రహదోషాలు పోతాయిని, సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ నాగుపాము రూపంలో సంచరిస్తూ ఉంటాడని భక్తుల నమ్మకం.

This Channel Provides Tech News In Telugu & Good Travelling Videos.

Комментарии

Информация по комментариям в разработке