1,300 ఏళ్ల నాటి ‘మాయా ఖడ్గం’ అదృశ్యం! - TV9

Описание к видео 1,300 ఏళ్ల నాటి ‘మాయా ఖడ్గం’ అదృశ్యం! - TV9

ప్రపంచంలోకెల్లా అత్యంత పదునైనదిగా, నాశనం కానిదిగా అభివర్ణించే పురాతన ఫ్రెంచ్ ఖడ్గం అదృశ్యమైంది. రోకమడోర్ అనే పట్టణంలో 1,300 ఏళ్లుగా ఓ 100 అడుగుల ఎత్తయిన బండరాయిలోకి సగం దిగబడిన కత్తి చోరీకి గురైనట్లు స్థానికులు భావిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే 100 అడుగుల ఎత్తుకు ఎక్కి ఆ ఖడ్గాన్ని దొంగిలించడం ఎలా సాధ్యమైందో అంతుబట్టక తలలుపట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ పట్టణానికి అతిపెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ గా ఈ ఖడ్గం, దాని చరిత్ర నిలిచాయి. ఇప్పుడు ఆ కత్తి అదృశ్యం కావడంతో స్థానికులు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయోనని ఆందోళన చెందుతున్నారు. వందల ఏళ్లుగా తమ పట్టణ చరిత్రతో ముడిపడి ఉన్న ఆ ఖడ్గం గురించి ప్రతి టూరిస్ట్ గైడ్ వివరించకుండా ఉండేవారు కాదని పట్టణ మేయర్ డోమినిక్ లెన్ ఫెంట్ చెప్పారు.

►TV9 Website : https://tv9telugu.com/
►News Watch : https://bit.ly/3g9b8IG
►KNOW THIS : https://bit.ly/3APEpAj
►PODCAST : https://bit.ly/3g7muNw
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#MayaKhadgam #ViralNews #ViralVideos #TrendingNews

Credit: #NewsUpdates | Rajeswari/Producer #TV9D

Комментарии

Информация по комментариям в разработке