#నవద్వారాపురమనే

Описание к видео #నవద్వారాపురమనే

మానవజన్మ పరమార్థం-మేలుకొలుపు – తత్వము
1. నవద్వారా పురమనే నయ పట్నమందున l నమ్మి నిదురపోక మేలుకో l
నమ్మి నిదురబోతే నట్టేటిలోముంచు l నెమ్మదిని యోచించి మేలుకో ll “నవ”
“సర్వకర్మాణి మనసా సన్న్యస్యాస్తే సుఖం వశీ ।
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్న కారయన్ ।।” (5-13)
2. తోపక రూపక జ్ఞాపకముల జిక్కీ l రాపాడి చెడిపోక మేలుకో l
ఆపోజ్యోతి పాప వ్యాపారమంతాయు l మాపి లేపు గురుడు మేలుకో ll “నవ”
3. శబ్ద స్పర్శ రూప రస గంధ వనములో l చెడి తిరుగుటెందుకు మేలుకో l
నిబ్బరమును బూని దబ్బున గురు జేరి l మబ్బునహముదీరి మేలుకో ll “నవ”
4. చిత్తామనేచోట వృత్తులనే తోట l మత్తెక్కి తిరగక మేలుకో l
ఉత్త బట్టబయలేమీ లేదని గురుడు l స్పష్ట పరచే బాట మేలుకో ll “నవ”
5. శుక్ల శోణిత జనిత శూద్ర కొంప తనువు l శుచియని భ్రమయక మేలుకో l
కుక్క తోలు కన్నా తక్కువ దీనిపై l మక్కువ బెట్టక మేలుకో ll “నవ”
6. మల మూత్రముల రోత మైల కొంపను మంచి l మడియని మురియక మేలుకో l
మూలమింత యు లేని మురికి తోలు దీని l ముచ్చట లేదని మేలుకో ll “నవ”
7. అక్కర మాలిన లెక్కల లోబడి l చిక్కులు బొందక మేలుకో l
నొక్క నిమిషంలోనే లెక్క తీరుపు జేసి l చక్కపరిచే గురుడు మేలుకో ll “నవ”
8. తప్పు పత్రము మేను తాకట్టు బెట్టుచూ l అప్పుల పాలవక మేలుకో l
నీ అప్పు పత్రము చించి తాకట్టు విడిపించి l ముప్పు ముంచే గురుడు మేలుకో ll
9. సంత కూటమి సంసారమనే భ్రాంతి l చింతలో మునగాక మేలుకో l
నీ సొంత మేమియు లేదు అంతయూ గురునీదే l చింతేల నీకింక మేలుకో ll
“నవ”
10. పరమ గురుని పాదపద్మములు సేవించి l పరమార్థమార్జించి మేలుకో l
ఎరువు సొమ్ము ఎరుక ఎందుకు నీకింకా l?! ఎరుక మరుపులు లేక మేలుకో ll
“నవ”
11. నిజమును దెల్పెటి నిజగురు వెంపటి l లక్ష్మీ నరహరి జేరి మేలుకో l
అభిమాన మంతయు హతమయ్యే ఈ రోత l బతుకంతా బయలాయే మేలుకో ll
“నవ”
నవద్వారా పురమనే నయ పట్నమందున l నమ్మి నిదురపోక మేలుకో l
నమ్మి నిదురబోతే నట్టేటిలోముంచు l నెమ్మదిని యోచించి మేలుకో ll
“నవ”
జై సద్గురు ప్రభు మహారాజుకు జై.
రచన : శ్రీ వెంపటి లక్ష్మీ నరసింహం.
గానం : పరిపూర్ణ దయానిధి వై.హరి.
వ్యాఖ్యాత : సహజాచల రాజయోగి వెంకటేశన్ పూజారి

Комментарии

Информация по комментариям в разработке