EVM Vandalism Case | Pinnelli Sent to Nellore Jail | నెల్లూరు జైలుకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి

Описание к видео EVM Vandalism Case | Pinnelli Sent to Nellore Jail | నెల్లూరు జైలుకు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి

అరాచకానికి, గూండాయిజానికి పెట్టింది పేరైన వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆయనపై నమోదైన నాలుగు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడంతో నిన్ననే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత భారీ బందోబస్తు మధ్య నరసరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి నరసరావుపేట ప్రాంతీయ ఆసుపత్రిలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి..... వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత నరసరావుపేట ఎస్పీ కార్యాలయం నుంచి.. గత రాత్రి భారీ బందోబస్తుతో.. మాచర్ల తీసుకువచ్చారు. మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆ తర్వాత పిన్నెల్లి తరపు న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు తెల్లవారుజామున 4గంటల వరకూ... బెయిల్ పై వాదనలు వినిపించారు. ఈవీఎం ధ్వంసం సహా ఓటర్లను భయపెట్టిన నాలుగు కేసుల్లో...... విచారణ జరిపిన న్యాయమూర్తి.... రెండు కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. మరో రెండు కేసుల్లో..రిమాండ్ విధించారు. నంబూరి శేషగిరిరావుపై దాడి, కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి కేసుల్లో..... పిన్నెల్లికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈవీఏం ధ్వంసం, మహిళపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని నెల్లూరు జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆ మేరకు పోలీసులు ఆయన్ని తీసుకెళ్లారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке