Ballari Famous Uggani | Bellery | Rayalaseema Special Traditional Food | Uggani Bajji | Food Book

Описание к видео Ballari Famous Uggani | Bellery | Rayalaseema Special Traditional Food | Uggani Bajji | Food Book

బళ్లారి భౌగోళిక, వాతావరణ స్థితులు వ్యవసాయానికి అత్యంత అనుకూలం.కనుకనే ఇక్కడి నల్ల రేగడినేల పై తుంగభద్రమ్మ ఆశీస్సులతో రైతులు విరివిగా సాగు చేస్తుండతంతో
వివిధ వాణిజ్య పంటలతో వర్తకంలో అనేక ఆహార పంటలతో ఆహార ఉత్పత్తిలోను ప్రాముఖ్యత పొందింది ఈ ప్రాంతం.ఈ తరుణంలోనే ఇక్కడ మాత్రమే పండించి ప్రత్యేకమైన వడ్లతో తయారు చేసే బోరుగులు ఎంతో నాణ్యతను కలిగి ఉండి బళ్లారి బొరుగులుగా వాసికెక్కాయి.ఈ నేపథ్యం లో బొరుగుల తయారీ బట్టీలు ఇచ్చట కుటీర పరిశ్రమగా వర్దిల్లుతూ ఏంతో మందికి జీవనోపాధి చూపుతుంది.

మరమరాలతో ఎన్నో ఆహార పదార్థాలు రూపం దాల్చుతున్న వాటిలో బళ్లారి బొరుగులతో చేసే ఉగ్గాని రారాజు.

ఉగ్గాని జన్మస్థల రీత్యా స్థానికులు తయారీలో అత్యంత శ్రేష్ఠులు.వాస్తవిక రుచి సమకూర్చడంలో ప్రావీణ్యత గల వారు.కాబట్టే
ఉగ్గాని వంటల పరంగా బళ్లారి తోపాటు రాయలసీమకు విశిష్టత ను చేకూర్చింది.

ముచ్చట గొల్పే నేస్తాలు ఉగ్గాని,బజ్జిలు.ఒద్దిక గల ఉపాహారాలవి.
వేడి,వేడి ఉగ్గానిపై కొబ్బరి కారం విరజల్లి రవ్వంతైనా ఖాళీ లేకుండా నోటి అంతటికీ అందించగా పరిచయ రుచితో తృప్తి కలుగుతుంది.ఆ తదుపరి కారం పరిధి మధ్యస్థంగా వుండే బళ్లారి మిరపకాయలతో తయారు చేసిన బజ్జిలు నంజుకుని తింటే అల్పాహారాలు మిళితమై నాలుకపై దరహాసమాడు రుచి అద్భుతం..అలానే వడ తో సైతం జోడించుకుని తింటే చాలా బాగుంటుంది.

అలానే కర్ణాటక లోని రాయచూరు తెలంగాణ లోని గద్వాల్ ప్రాంతాలలో ప్రాముఖ్యమైన ఈ అల్పాహారాన్ని
ఆయా ప్రాంతాల్లో మండక్కి వగ్గరణె,బోరుగుల తిరగవాతగా,బోరుగుల చిత్రాన్నంగా పిలుస్తున్న ఉగ్గానిగా మనందరికీ సుపరిచితం అన్నది విధితమే.
తయారీకీ అయ్యే వ్యయం స్వల్పం.రుచి అద్భుతం కనుక.తమ స్థోమతకు తగ్గ వంటకమనుకునే
రెక్కాడితే గానీ డొక్కాడని, కాయకష్టం చేసే వారు. ఉగ్గాని బీద వాని బిర్యానీ గా భావిస్తారు.

ప్రసిద్ధి చెందిన ఉగ్గాని గూర్చి కార్యక్రమాన్ని బళ్లారిలో శ్రీనివాస్, యశోద గార్ల దంపతులు నిర్వహణ చేస్తున్న అల్పాహార శాలలో చిత్రీకరణ చేసాము.తక్కువ ధరకే నాణ్యత తో కూడిన ఉగ్గాని వారు అందించారు.
నిత్యం ఇక్కడ తినేవారి అభిప్రాయం తెలుసుకున్నా తదుపరి దంపతులు మనకు తమ ఆహార శాల గురుంచి వివరిస్తారు.

Комментарии

Информация по комментариям в разработке