Jaikisan TS | 22nd June'19 | బోర్లు ఎక్కడ వేస్తే నీరు పడుతుందో తెలిపే సాంకేతిక పరిజ్ఞానం

Описание к видео Jaikisan TS | 22nd June'19 | బోర్లు ఎక్కడ వేస్తే నీరు పడుతుందో తెలిపే సాంకేతిక పరిజ్ఞానం

చెరువులు, కుంటలు, కాల్వల నీరు తర్వాత... రైతులు అధికంగా ఆధారపడేది బోర్ల మీదే. భారీ ప్రాజెక్టులు, సాగునీటి జలాశయాలు లేని జిల్లాల్లో... సేద్యానికి బోరు బావులే దిక్కు. కాగా బోర్లలో నీరు పడడం అన్నది బొమ్మా బొరుసు లాంటిది. ఎక్కడ తవ్వాలి? ఎక్కడ బోరు వేస్తే నీరు వస్తుందన్నది అంతుపట్టని విషయం. బోర్లు తవ్వేవారు సంప్రదాయ, ఆధునిక పద్ధతులు పాటిస్తున్నా... పలానా ప్రదేశంలో తవ్వితే నీరు కచ్చితంగా పడుతుందన్న సాంకేతికత నేటికీ అందుబాటులోకి రాలేదు. అంచనాలు, అదృష్టంమీద ఆధారపడే ప్రస్తుత విధానంలో... సగం బోర్లు విఫలమై రైతులు నష్టపోతున్నారు. అయితే ఎక్కడ తవ్వితే జలం తగులుతుంది? ఎంత లోతులో నీరు ఉందన్న విషయాలు నిర్దిష్టంగా చెప్పే సాంకేతికతని...జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ-NGRI అభివృద్ధి చేసింది. ప్రస్తుతానికి ఈ పరిజ్ఞానం పెద్ద పెద్ద కమతాలు, ప్రాంగణాలకే ఉపయోగపడుతుందని... భవిష్యత్‌లో చిన్న చిన్న పొలాల్లో సైతం భూగర్భ జలం గుర్తించే విధంగా పరిశోధనలు సాగుతున్నాయంటున్న శాస్త్రవేత్త MJ నందన్‌ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.
----------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!
☛ Visit our Official Website: http://www.etv.co.in
☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr
☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE

Enjoy and stay connected with us !!
☛ Like us :   / etvjaikisan  
☛ Follow us :   / etvjaikisan  
☛ Circle us : https://goo.gl/1ySn5s
----------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке