పుష్పక్‌ ప్రయోగం విజయవంతం | ISRO Successfully Tested Reusable Launch Vehicle Pushpak Mission

Описание к видео పుష్పక్‌ ప్రయోగం విజయవంతం | ISRO Successfully Tested Reusable Launch Vehicle Pushpak Mission

పునర్వినియోగ వాహక నౌక పుష్పక్‌ను వరుసగా 3వ సారి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. మరింత ప్రతికూల పరిస్థితుల మధ్య నిర్వహించిన ప్రయోగంలో స్వయంప్రతిపత్తిగల ల్యాండింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు ఇస్రో పేర్కొంది. అంతరిక్షం నుంచి వచ్చిన నౌక కోసం అప్రోచ్ ల్యాండింగ్ ఇంటర్ ఫేస్, హై స్పీడ్ ల్యాండింగ్ పరిస్థితులను సిమ్యులేట్ చేయడం ద్వారా RLV అభివృద్ధికి అవసరమైన అత్యంత క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించినట్లు తెలిపింది. కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో పుష్పక్ కు సంబంధించిన చివరి పరీక్ష ఇదేనని వివరించింది.
భూమికి 4.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి వైమానికదళ చినూక్ హెలికాప్టర్ నుంచి పుష్పక్ ను జారవిడవగా, తీవ్రమైన గాలుల మధ్య అది స్వయంప్రతిపత్తితో కిందకు దూసుకొచ్చిందని అధికారులు తెలిపారు. ల్యాండింగ్ వెలాసిటీ గంటకు 320 కిలోమీటర్లను మించిపోయిందనీ రన్ వేపై పారచూట్ తెరుచుకోగా.. అది గంటకు 100 కిలోమీటర్ల వేగానికి తగ్గిందని వెల్లడి చేశారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке