అనాలోచిత చట్టం(APల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023)పై సీనియర్ న్యాయవాది శ్రీ.వై.జయ రాజు స్పందన

Описание к видео అనాలోచిత చట్టం(APల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023)పై సీనియర్ న్యాయవాది శ్రీ.వై.జయ రాజు స్పందన

భూ హక్కు చట్టం అంటే ఏమిటి?
రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా వెలుగులోకి తెచ్చిన చీకటి చట్టం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను న్యాయవాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

అక్టోబర్ 31 2023 నుంచి అమలులోకి వచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ హక్కు చట్టం ప్రకారం ఎటువంటి అర్హత అనుభవం లేని రాష్ట్ర ప్రభుత్వం చే నియమించబడు ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ నమోదు చేసే హక్కు రిజిస్టర్ లో ఒక్కసారి భూహక్కుదారుడు పేరు నమోదైన తర్వాత ఈ భూములు పై ఎవరూ కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు.
ఎవరైనా అభ్యంతరాలు ఉంటే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లాస్థాయిలో ఏర్పాటు చేయబోవు రెవెన్యూ ట్రిబునల్స్ లోనే తేల్చుకోవలసి ఉంటుంది. అంతేతప్ప కోర్టుకు వెళ్లడానికి వీలు లేదు. రెవెన్యూ ట్రిబునల్స్ నందు కేసు దాఖలు చేయాలనుకుంటే టైటిలింగ్ ఆఫీసర్ నమోదు చేసిన వివరాలను రెండు సంవత్సరముల లోపే దాఖలు చేయవలసి ఉంటుంది. సదరు ఎంట్రీస్ ఆన్లైన్లో లభించవు మరియు ఈ చట్టంలో సదరు ఎంట్రీస్ ఎప్పుడు ఎవరి పేరుతో నమోదైనవి వివరాలు పొందుపరచలేదు.

ఉదాహరణ: ఒక సర్వే నంబర్లో A అను అతనికి 4 ఎకరాల్లో భూమి ఉంది అనుకుందాం. ఈ చట్టం ద్వారా ఎటువంటి అనుభవము బాధ్యత లేని టైటిలింగ్ ఆఫీసర్ B పేరు మీద మూడు ఎకరములు నమోదు చేసినారు అనుకుందాం. సదరు చట్టం లో పారదర్శకత లేనందువలన మరియు సదరు రిజిస్టర్ ఆన్లైన్లో లభ్యo కానందువలన A కు సంబంధించిన ఆస్తిని B పేరు నమోదు చేసినందున A కు సదరు విషయం తెలియదు. రెండు సంవత్సరాల తర్వాత ఈ విషయం తెలుసుకొని A కేసు దాఖలు చేయాలనుకున్న దాఖలు చేయుటకు అవకాశం లేదు. దానివల్ల A తీవ్రంగా నష్టపోతాడు.

రెవెన్యూ ట్రిబునల్స్ ఇచ్చిన జడ్జిమెంట్ మీద 15 రోజుల లోపల రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేయబోవు ట్రిబునల్స్ లోనే కేసు దాఖలు చేయవలసి ఉంటుంది. సదరు ట్రిబునల్స్ ఇచ్చిన తీర్పు పై హైకోర్టులో మాత్రమే అప్పీలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఒకవేళ ట్రిబ్యునల్ తీర్పుపై ఎవరు అప్పీలు దాఖలు చేయకపోయినా రెండు సంవత్సరముల లోపల ట్రిబ్యునల్ లో కేసు వేయకపోయినా సదురు ఆస్తిపై హక్కు ఉండదు. ఒకవేళ ఎవరైనా కోర్టుకు వెళ్లిన ఆ కేసులను కోర్టు ట్రిబ్యునల్ కు పంపుతాయి. కోర్టులకు ప్రత్యామ్నాయ సమాంతర అధికారాలు ఉండవు. ఒకవేళ హక్కుదారుడు మరణించిన ఎడల వారసులు దరఖాస్తు చేసుకొనవచ్చును. అప్పుడు మరణించిన భూహక్కుదారుడి పేరును వారసులపేరుతో భర్తీ చేసే అధికారం ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్కే ఉంటుంది. అందువల్ల అసలు హక్కు దారులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది.

గౌరవ సుప్రీంకోర్టు వారు పలు సందర్భాలలో రెవిన్యూ రికార్డుల్లో పేరు నమోదయినంత మాత్రాన ఆస్తి మీద అతను భూ యజమాని కాదని రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యముగా పనికిరావని స్పష్టం చేసింది. ఎందుకంటే అవన్నీ శిస్తు వసూలు చేయడానికి బ్రిటిష్ వారు నుంచి వ్రాసిన లెక్కలు పుస్తకాలు. అందులో పన్ను ఎంత కట్టాలో ఉంటుంది తప్ప ఆ భూమి మీద ఎవరికి హక్కు ఉంటుంది అని చెప్పలేదు. ఈ చట్టం అమలులోకి వచ్చినట్లయితే భారత పౌరుని యొక్క రైట్ టు ప్రాపర్టీ హక్కుకే విధానం కలిగే అవకాశం ఉన్నది.
న్యాయ పరిధిలోని అంశాలపై న్యాయస్థానంలో విచారణ చేయకుండా రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండే విధంగా ఉన్నది. అందువలన ఈ చట్టాన్ని సవరించవలసినదిగా న్యాయవాదులు పోరాటం చేస్తున్నారు. ఈ అనాలోచిత చట్టం (AP ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023)పై సీనియర్ న్యాయవాది మరియు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ.వై.జయ రాజు స్పందన ఇక్కడ ఉంది. దయచేసి వీడియోని చూడండి మరియు మీరు అతనితో ఏకీభవిస్తే మీ సహచరులు మరియు స్నేహితులతో భాగస్వామ్యం చేయండి. ధన్యవాదాలు. On this ill-timed act (AP Land titling Act 2023),here is the reaction from Senior Advocate and former Public Prosecutor Sri.Y.Jaya Raju. Please watch video and share it with your colleagues and friends if you agree with him. Thank you.

Комментарии

Информация по комментариям в разработке