గూగూడు కుళాయి స్వామి చరిత్ర || GUGUDU KULLAIE SWAMI CHARITHRA

Описание к видео గూగూడు కుళాయి స్వామి చరిత్ర || GUGUDU KULLAIE SWAMI CHARITHRA

ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా కర్నాటక, తమిళనాడు, గోవాలో కూడా మొహర్రం ఉత్సవాలకు గూగూడు కుళ్లాయిస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఉత్సవాలకు ముఖ్యంగా అగ్నిగుండం ప్రవేశం రోజున స్వామివారి దర్శనం కోసం గూగూడుకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడ మరో విశేషం ఆంజనేయస్వామి, కుళ్లాయిస్వామి దేవాలయాలు పక్కపక్కనే ఉంటూ మత సామరస్యానికి నిలువుటద్దంగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా ఈనెల 12 నుంచి కుళ్లాయిస్వామి బ్రహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...
ప్రస్తుతం గూగూడు కుళ్లాయిస్వామి ఉన్న చోట గుహుడు అనే మహర్షి ఓ ఆశ్రమం ఏర్పాటుచేసుకొని శ్రీరాముడి కోసం తపస్సు చేసుకునేవాడు. అప్పుడు ఆ ప్రాంతం అంతా అరణ్యం.
అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడు తన భార్యను వెదుకుతూ ఈ ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు గుహుడి ఆతిథ్యాన్ని స్వీకరించాడు.
సీత జాడ తెలిసిన తర్వాత మరోసారి సీతా సమేతుడై గుహుడికి దర్శనమిస్తానని శ్రీరాముడు ఆ పురుషోత్తముడికి తెలియజేస్తాడు.

దీంతో ఆనందభరితుడైన ఆ గుహుడు అక్కడే తపస్సు చేస్తూ గడిపాడు. రామరావణ యుద్ధంలో శ్రీరాముడు రావణుడిని సంహరించిన తర్వాత అయోధ్యకు బయలుదేరుతాడు.

అయితే అయోధ్యకు చేరే తొందర్లో గుహుడుకు ఇచ్చిన మాటను మరిచిపోతాడు. ఎంత కాలమో వేచి చూసిన గుహుడుకు శ్రీరాముడు తన ఆతిథ్యం స్వీకరించకుండానే అయోధ్య చేరిన విషయం తెలుస్తుంది.

దీంతో తీవ్రంగా బాధ పడిన ఆ గుహుడు ఆత్మాహుతికి సిద్ధపడుతాడు. దూరద`ష్టితో ఈ విషయాన్ని గమనించిన శ్రీరాముడు తన నమ్మిన బంటు అయిన ఆంజనేయుడిని గుహుడి వద్దకు పంపిస్తాడు.

అంతేకాకుండా తాను త్వరలో వచ్చి సీతాలక్ష్మణ సమేతుడై దర్శనమిస్తానని సందేశం పంపుతాడు. దీంతో గుహుడు తన ప్రయత్నాన్ని విరమించుకొంటాడు.








#GUGUDUKULLAIESWAMICHARITHRA


#gugudu
#kullaieswami_charithra
#kullaieswamykatha
#kullaieswamy_movie

Комментарии

Информация по комментариям в разработке