BRS MLA Padi Kaushik Reddy House Arrest | Minister Ponnam| ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని గృహనిర్బంధం

Описание к видео BRS MLA Padi Kaushik Reddy House Arrest | Minister Ponnam| ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని గృహనిర్బంధం

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో కాంగ్రెస్, భారాసాల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత కొనసాగుతోంది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ప్రణవ్...ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్దకు ప్రమాణం చేసేందుకు రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి వీణవంకకు చేరుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు. మరోవైపు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బయటికి రాకుండా సింగపూర్ లో గృహ నిర్బంధం చేశారు. ఇరు పార్టీల నాయకులు రాకుండా పోలీసులు కట్టుదిట్టం చేసినప్పటికీ... కొంతమంది బాధితులు ఇరుగుపొరుగు గ్రామాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్దకు వచ్చారు. పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకుంటున్నారు మరోవైపు ఒక బాధితుడు తన వద్ద 20 లక్షల రూపాయలు తీసుకున్న పాడి కౌశిక్ రెడ్డి కోర్టులో ఉద్యోగం ఇప్పించకుండా మోసం చేశారని తడి బట్టలతో ప్రమాణం చేశారు. దీనితో హనుమాన్ ఆలయం వద్ద కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డి దౌర్జన్యాలు చేశారని... ప్రభుత్వంలో లేకున్నా అధికార పార్టీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీ చేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке