అచల తత్వ జ్ఞానం(ACHALA THATVA GNANAM): ఏదిరా యీ జనన మరణాము నిజబోధ గనిన, శ్రీ సబ్బకవి వారి తత్వము

Описание к видео అచల తత్వ జ్ఞానం(ACHALA THATVA GNANAM): ఏదిరా యీ జనన మరణాము నిజబోధ గనిన, శ్రీ సబ్బకవి వారి తత్వము

ప్రస్తుత ఫీఠాధ్యక్షులు :- శ్రీ శ్రీ నంబి వేణునాద స్వాములవారు
Phone no :- 94915 21530
ఆధ్యాత్మిక అచల పీఠం, సద్గురు సన్నిది , వడమాలపేట , తిరుపతి, చిత్తూరు జిల్లా.

రచించిన వారు :- శ్రీ యిందుకూరి సాంబయ్య శిష్యులు శ్రీ సబ్బకవి వారి తత్వము

గానం :- ఈశ్వరయ్య స్వామి (మదనపల్లె)
తత్వము :-
***************************************************

శ్రీ యిందుకూరి సాంబయ్య శిష్యులు శ్రీ సుబ్బకవి వారి తత్వము :-

1. ఏదిరా యీ జనన మరణాము నిజబోధ గనిన లేదురా యీ మోక్షనరకాము. యేదిరాయీ జనన మరణము లేదురా పరిపూర్ణమందును వేద శాస్త్రాభ్యాసులను మత వాదులను విడనాడు వారికి .. ఏదిరా..

2. తాను వచ్చినచోటు దెలియాదు - తనతోటి సర్వము తర్లి పొయ్యె బాటదెలియాదు - లేనిపోనీ స్వప్నమందున యేనుగులు గుర్రాలు రథములు సేనలు సేనాధి పతుల అయోని సంభవమైన తనువుల.. ఏదిరా..

3. రాజులేడూ మంత్రిలేడురా - రాజొక్కడుంటే గాజు కడియము దెందుకౌనురా - రాజులేని కయ్యమా యెను - రాజ్యకాంక్షలు దబ్బరాయెను - వాజిపేయుల సోమయాజుల వాంఛకలలో వార్తలాయెను .. ఏదిరా..

4. దిక్కులేని దొరత నామురా - దిక్కనేదుంటే నిక్కమూ యీ జగము లౌనురా, దిక్కులేని తనువు యిలపై పెక్కు శాస్త్రామూల గాధా - ఒక్కరేప్పాపాటులోపల - బొక్క బెట్టును పెక్కు జీవుల...కేదిరా..

5. యెన్నటికినీ నమ్మరానిది, క్షణబంగురంబిది, యెన్ని పేర్లో బెట్టుకున్నాది - తన్నుతాను కన్నమోక్షంబన్నమాట సున్నాలాయెను ఉన్నదా
పరిపూర్ణమందున నిన్ననేతెరతీసి నప్పుడు .. ఏదిరా..

6. తల్లినీ స్థూలాంగమందూరు - తరువాత దాని పిల్లనూ సూక్షాంగమందురూ - తల్లి జాగ్రత్త పిల్ల స్వప్నము పిల్లజాడే తల్లి కాయెను ఎల్లలోకము - బ్రతుకు భాగ్యము - చెల్లిపోయిన పత్రమాయెను .. ఏదిరా..

7. వింత వింతలు తోలుబొమ్మాలూ - పరిపూర్ణ జలధిలో ముంతలూ యీ కీలు బొమ్మాలు - భ్రాంతి రహితమైన గురునీ - చెంత జేరి షోడశాక్షరి సంతతము - యీ ద్వాదశాక్షరి చింతనా జేసేటి వారికి .. ఏదిరా..

8. నీవు బయలులోన యుంటివీ నీయందు బయలు నిండియున్నా దెరుగకుంటివీ - నీకు బయలు సూచనైతే నిలువలేవూ నిమిషమైనను కేవలము నీకావలీవల స్థావరమే పరిపూర్ణమాయెను . యేదిరా..

9. సందియంబులు దీరెనేటికీ - మాదెందుకూరి ఇందు ధరుని శిష్యకోటికి, ఎందరూ లేదన్న బయలూ ఎందుకూ లేకుండ బోవును - అందరీలో సుబ్బకవి యీ యనుభవార్థంబిచట దెలిపెను.. ఏదిరాయీ జనన మరణాము..

***************************************************

Комментарии

Информация по комментариям в разработке