శ్రీ వెంకటేశ్వరస్వామి భూమిపైకి ఎందుకు వచ్చాడు || COMPLETE STORY OF SRI VENKATESHWARA || UHT

Описание к видео శ్రీ వెంకటేశ్వరస్వామి భూమిపైకి ఎందుకు వచ్చాడు || COMPLETE STORY OF SRI VENKATESHWARA || UHT

Join this channel to get access to perks:
   / @untoldhistorytelugu  
#శ్రీవెంకటేశ్వరస్వామిభూమిపైకిఎందుకువచ్చాడు#COMPLETESTORYOFSRIVENKATESHWARA#UHT
శ్రీ వెంకటేశ్వరస్వామి భూమిపైకి ఎందుకు వచ్చాడు || COMPLETE STORY OF SRI VENKATESHWARA || UHT
ఒక్కప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు. యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడకు వచ్చి, అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూసి, ఆ మహర్షులను క్రతువు దేనికొరకు చేస్తున్నారు, యాగఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించే వారు ఎవరు అని ప్రశ్నిస్తే, నారదుని సలహామేరకు అందరూ భృగు మహర్షి వద్దకు వెడతారు. అప్పుడు ఆ మహర్షులందరు భృగు మహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వకోరికలు తీరుస్తారో పరీక్షచేసి చెప్పమని కోరుతారు.సత్యలోకంమహర్షుల కోరికమేరకు భృగువు యోగదండం, కమండలం చేత బట్టి, జపమాల వడిగా త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా, బ్రహ్మ సరస్వతీ సమేతుడై సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ, చతుర్వేదఘోష జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ, సృష్టి జరుపుతూ ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించడు. తన రాక గ్రహించని బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలుండవు అని శపిస్తాడు.కైలాసం
బ్రహ్మలోకం నుండి శివలోకం వెళతాడు భృగువు. శివలోకంలో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు. వారు భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి, శివునకు కలియుగంలో భూలోకంలో విభూతితో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడువైకుంఠం
శ్రీ వేంకటేశ్వరుడు
శివలోకం నుంచి నారాయణలోకం వెళతాడు భృగువు. ఇక్కడ నారాయణుడు ఆదిశేషుని మీద శయనించి ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలుకలేదని భృగువు, లక్ష్మీ నివాసమైన నారాయణుని వామ వక్షస్ధలాన్ని తన కాలితో తన్నుతాడు .అప్పుడు శ్రీమహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకు దిగి " ఓ మహర్షీ!మీ రాకను గమనించలేదు, క్షమించండి.నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయుంటాయో" అని భృగుమహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని ఒత్తడం మొదలుపెట్టాడు. అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రిందిభాగంలోని కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకొని వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు. కాని తన నివాసస్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీమహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి పయనం అయ్యాడు.
భూలోకం
తిరుమలలోని వేంకటేశ్వరని ఆలయం ముందు భాగం
లక్ష్మీదేవి తన స్వర్గపు నివాసాన్ని విడిచిపెట్టి, భూమిపై కరవీరపూర్ (కొల్హాపూర్) లో నివసించింది. ఆమె బయలుదేరిన తర్వాత, విష్ణువు భూలోకంలో, వెంకట కొండపై పుష్కరిణి పక్కన, ఆహారం, నిద్ర లేకుండా, లక్ష్మి తిరిగి రావడానికి ధ్యానంతో. చింత చెట్టు క్రింద చీమలపుట్ట (కొండ) లో నివసించాడు.బ్రహ్మ , శివుడు అతడిపై జాలి కలిగి, విష్ణువుకి సేవ చేయాలని ఒక ఆవు, దూడ రూపాలుగా ఏర్పడ్డారు. లక్ష్మీ ఒక ఆవులకాపరిణి రూపంలో చోళ దేశం యొక్క రాజుకు ఆవు, దూడను అమ్మింది. చోళ రాజు తన పశువుల మందతో పాటు వెంకట కొండపై ఈ పశువులను కూడా కలిపి మేపటానికి పంపుతాడు. చీమలపుట్ట మీద విష్ణువుని కనిపెట్టి, ఆవు తన పాలును అందించి, తద్వారా అతనికి ఆహారం ఇచ్చింది. ఇంతలో, రాజభవంతి వద్ద, ఆవు నుండి కొద్దిగానైనా పాలు లభించడం లేదని, దీని వల్ల చోళ రాణి ఆవు కాపరుడికి శేరాబడు అనే యాదవుడు . పాలు లేకపోవడానికి కారణాన్ని తెలుసు కోవడానికి, ఆవు కాపరుడు శేరాబడు ఆవును రహస్యంగా అనుసరించి, చీమలపుట్టపై తన పొదుగు నుండి పాలను ఖాళీ చేస్తున్న ఆవును కనుగొన్నాడు. ఆవు యొక్క ప్రవర్తన వలన ఆగ్రహానికి గురైన ఆవు కాపరుడు శేరాబడు తన గొడ్డలిని ఆవు మీదకు విసిరి వేసాడు, కాని ఆవుకు హాని కలిగించ లేకపోయాడు. అయినప్పటికీ, ఆవు కాపరుడు శేరాబడు విసిరిన గొడ్డలి దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణువు చీమలపుట్ట నుండి పైకి వచ్చాడు. ఆవు కాపరుడు శేరాబడుతన గొడ్డలి దెబ్బతో విష్ణువుకు రక్తస్రావం అవటం చూసినపుడు, శేరాబడుకి మహావిష్ణువు పిశశిగా శేరాబడు ని శపిస్తాడు తన తప్పు తెలుసుకొని క్షమించమని ప్రార్థిస్తాడు మహావిష్ణువు అప్పుడు నాకు పద్మావతి తో కళ్యాణం జరుగుతుంది అప్పుడు నీకు శాపం విమోక్షం కలుగుది మహావిష్ణువు శేరాబడు కి ఒక వరం ఇస్తారు భూమి మీద మొట్ట మొదట నువ్వు నన్ను చూశావు కాబట్టి నా ప్రధమ దర్శనం నీకె ఇస్తున్నాను ఆ శాపం అంతం అవుతుందని విష్ణువు దీవించాడు.
"Ethereal Relaxation" Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By Attribution 4.0 License
http://creativecommons.org/licenses/b...

Комментарии

Информация по комментариям в разработке