Nee gudi tudichi raabadi marachi | emotional song lord venkateswra swami sung by | sreedhar master

Описание к видео Nee gudi tudichi raabadi marachi | emotional song lord venkateswra swami sung by | sreedhar master

గానం,సంగీతం
కుడుపూడి శ్రీధర్

రచన
శ్రీమతి కళార్జున్

శివరంజని రాగం
చతురస్రజాతి తాళం
శ్రుతి 4 (F)


పల్లవి :
నీ గుడి తుడిచి రాబడి మరచి
సేవలు చేస్తున్న నీ సేవలు చేస్తున్న
పువ్వులు తెచ్చి మాలగ గుచ్చి
అలంకరిస్తున్న నిను అలంకరిస్తున్న
ఏమి చేస్తున్న నా తనివి తీరదు
అసలు ఏమి చేయకున్నా నా తనువు రాలదు


1) ఆకలి అవుతున్న నీ వాకిలి ఊడ్చదను
ఊపిరి పోతున్న నీ ఊయల ఊపేదను
ఆలయసేవయే అత్యద్భుత సేవయని
దేవుని సేవయే దివ్యానంద సేవయని
ఏడుకొండల వేంకటేశ్వరా సేవలు చేస్తున్న నీ సేవలు చేస్తున్నా

2) ధూపం అర్పించి దీపం వెలిగించి
ఫలములు అందించి ఫలహారం చేయించి
అర్చన గావించి స్వరార్చన మొనరించి
వేదము పఠియించి వేడుక జరిపించి
ఏడుకొండల వేంకటేశ్వరా సేవలు చేస్తున్న మీ సేవలు చేస్తున్నా

Комментарии

Информация по комментариям в разработке