బలిజలకు కాపులకు ఏమిటి సంబంధం | Who are Balijas, kapus, Reddys

Описание к видео బలిజలకు కాపులకు ఏమిటి సంబంధం | Who are Balijas, kapus, Reddys

బలిజలకు కాపులకు ఏమిటి సంబంధం? ఒకప్పటి కాపులు నేడు రెడ్లుగా ఎందుకు పిలువబడుతున్నారు? కోస్తాకాపులు ఎవరు? కోస్తాకాపుల అసలు కులము ఏమిటి ? ఇటువంటి అంశాలపై పూర్తిగా చారిత్రక ఆధారాలతో ఈ వీడియో మీ ముందు ఉంచడం జరిగింది

ఏ రెండు కులాలను విడగొట్టే ఉద్దేశము ఈ విడోయేది కాదు.

మొదటి అంశము కాపులు ఎవరు ?
కాపులు కాంపిల్య నగరం నుంచి వచినవారని వీరిని కాంపులు అనేవారని ఆధునిక రచయితల అభిప్రాయము. కానీ ఈ వాక్యానికి ఎటువంటి చారిత్రక ఆధారాలూ లేవు. కాపులు అనగా ప్రధానంగా వ్యవసాయదారులు. గ్రామాధికారులను కూడా కాపు అనే సంబోదించేవారు. కానీ కాపులు ప్రధానముగా వ్యవసాయదారులు అనేది తరతరాలుగా శాసన సాహిత్యపరమైన ఆధారాలు ప్రకారం తెలిసే విషయం.

14వ శతాబ్దినాటి ఉదయగిరి చంద్రగిరి రాజ్యము ఏలుతున్న సాళువ నరసింగరాయల సేనాని సామంత మండలాధీశ్వరుడైన ఆరవీటి పిన్నమరాజు కుమారుడు బుక్కరాజు ఒక పద్యము ద్వారా కాపుకుల వర్ణనను తెలియజేసారు.

పంటాన్వయము నను పదునాలు శాఖల చక్కగా వివరింతు అంటూ కాపు కులములోని 14 శాఖలు ఉన్నట్టు అవి మోటాటికాపు (కర్నూలు ప్రాంతం కాపులు), వెలనాటికాపు (గుంటూరు లోని కొండవీడు బెల్లంకొండ వినుకొండ ప్రాంతాల కాపులు), మొరసకాపు (తమిళనాడు కర్ణాటక రాయలసీమ సరిహద్దు ప్రాంతాల కాపులు), నేరటికాపు (శ్రీకాకుళం ప్రాంత కాపులు), అయోధ్యకాపు (అయోధ్య నుండి వచ్చిన కాపులు), పంటకాపు (నెల్లూరు ప్రాంతం), పొంగలినాటి కాపు (చిత్తూరు తమిళనాడు సరిహద్దు ప్రాంతాల కాపులు ), పాకనాటికాపు (నెల్లూరు అద్దంకి ప్రాంత కాపులు), భూమంచి కాపు, కుంచేటి కాపు, మున్నూటికాపు (కృష్ణా జిల్లా ప్రాంతం, మిథిల నుండి వచ్చిన కాపులు) , గోదాటికాపు (గోటేటికాపు, గోదావరి జిల్లాల కాపులు ), గండికోట కాపు (కడప ప్రాంత కాపులు), ఓరుగంటికాపు (వరంగల్లు ప్రాంత కాపులు) వీరందరూ గౌరవదిష్ట కాపుకులము అని, 14 వర్గాల విభజన కాపులలో జరిగినట్టు, ఇంకా వీటికి ఉప జాతులు ఉన్నట్టు పద్యములో పేర్కొన్నారు. వీరందరూ నాటికి ఈ త్రిలింగ ఆంధ్రదేశంలో ఉన్న నాడుల ఆధారంగా పిలువబడిన కాపు కులస్తులు.

తరతరాలుగా కాపులుగా పిలువబడిన వీరు 1930 తరువాత రెడ్లుగా చలామణి అవుతున్నారు. . ఆనాడు 14 వ శతాబ్దములో బుక్కరాజు చెప్పిన కాపుకులములోని 14 శాఖలు నేటికీ రెడ్డి కులస్ధులలో ఉండడం గమనించవచ్చు,
మోటాటికాపులు నేడు మోటాటి రెడ్లుగా,
మొరసకాపులు మొరసరెడ్లుగా,
వెలనాటికాపులు వెలనాటిరెడ్లుగా,
పాకనాటికాపులు పాకనాటిరెడ్లుగా
పంటకాపులు పంటరెడ్లుగా, మొదలైన 14 శాఖల కాపులు మరియు ఈ శాఖలలోని శాకోపశాఖలుగా ఉపవర్గాలుగా ఉన్న అనేక కాపు ఉపకులాల చివర రెడ్డి చేర్చి పిలుచుకుంటున్నారు. ఇందుమూలంగానే వ‌డ్ల ర‌కాలు ఎన్నో రెడ్లరకాలు అన్ని అనే నానుడి చెబుతారు. ఇలా ఒకప్పటి కాపులే నేటి రెడ్లుగా స్దిరపడి ఉన్నారు.

ఈ కాపులు లేదా రెడ్ల మూల పురుషుడు అదిరెడ్డి అని, మొత్తము కాపు జాతి ఈ ఆదిరెడ్డి నుండే విస్తరించినట్టు కాపుల ఆశ్రిత కులమైన పిచ్చకుంట్లవారు పూర్వమునుండి గానము చేయు గాధలలో తెలియజేస్తారు.
ఈ ఆశ్రిత కులాలవారు కొన్నివందల సంవత్సరాలుగా తమను పోషించే తమ పోషక కులాల వారి చరిత్రలు, పురాణాలూ, వంశ చరిత్రలు, ప్రసిద్ధ వ్యక్తుల చరిత్రలూ కలిగి ఉండేవారు.

తరువాత భారతదేశాన్ని పాలించిన బ్రిటీషువారు తొలిసారిగా 1871లో సెన్సస్ డాటా ప్రకటించడం జరిగింది. 1871 నాటి నుండి వ్రాసిన సెన్సస్ రికార్డులు అన్నింటా వీరిని కాపు లేదా రెడ్డి కులస్ధులనే వ్రాసారు. తరువాత 1931 జనాభా లెక్కల్లో తమను కాపులుగా వ్రాయరాదని తమని ఇకనుండి రెడ్లుగా సంబోదించాలని అప్పటి హైద్రాబాదు రెడ్డి సభ ఇండియా సెన్సస్ కమిషనేర్ కు అభ్యర్ధన తెలిపారు, అప్పటినుండి వీరు పూర్వ కాలము నుండి వస్తున్న కాపు పేరును వదిలి రెడ్డి కులమని చెబుతారు.

పూర్వకాలమునుండి ఈ కాపులు కఠినమైన పీఠభూమిని సైతం దున్ని, దోకి సస్య శ్యామలం చేయగలిగారు. పంటలు పండించే వారు కనుకనే వారు పంట 14 శాఖలుగా కాపులుగా పిలువబడేవారు. ముందునుండి వ్యవసాయములో నిగమ్నమైనవీరు కాలక్రమేణా భూస్వాములు అయ్యి, గ్రామాల్లో పలుకుబడి, పెత్తనం సాధించి గ్రామాధికారి రెడ్డి హోదాను చేపట్టినారు. ఈ రెడ్డి హోదాలో ఎక్కువగా కాపులే ఉండడంతో ఆనాటినుండే ఈ కాపులను రెడ్డి అనికూడా సంబోదించేవారు. ఇందువల్లనే కాపు బలిస్తే రెడ్డి అనే సామెత చెబుతారు, అక్కడనుండి రెడ్డి జమిందారులు, కొండవీటి రెడ్డిరాజులు, రాజమహేంద్రవరం రెడ్డిరాజులు, తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఇప్పటివరకూ సేవలందించిన బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రాంరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైస్ రాజశేఖరరెడ్డి, నల్లారి కిరణకుమార్ రెడ్డి వంటివారెందరో ఈ కాపు కులం నుండి ముఖ్యమంత్రులుగా పరిపాలించినవారే. ఇలా 10 వ శతాబ్దము నుండి లభ్యమైన అనేక గాధలు, పురాణాలూ, పద్యాలూ, జమిందారీ రికార్డులు, బ్రిటిషువారి సెన్సస్ రికార్డులు, గజెట్ మాన్యుల్ల్ల అన్నింటా పురాతన కాలంనాటి నిజమైన కాపులు నేటి రెడ్లుగా, రెడ్ల అసలు కులము కాపుగానే చెప్పబడినారు.

ఇలా వెనకటి తరాల బలిజలుగా, తెలగబలిజలుగా పిలువబడి తెలగాలుగా స్దిరపడి, ఈ తెలగాలు వ్యవసాయము చేస్తూ, పెదకాపులుగా ఉంటూ కాపులై, ఈరోజు కాపులుగా చెప్పుకుంటున్నారు. కేవలము ఈ నాలుగుజిల్లాలో కాపులుగా తప్పితే వీరు దక్షిణ భాతదేశము అంతటా కేవలము బలిజలుగానే ఉన్నారు, మరియు ఈ నాలుగు జిల్లాల కాపులు, ఉత్తరాంధ్ర తెలగ దొరలు తప్పితే మరేఇతర కాపులు బలిజకులానికి చెందినవారు కాదు. ఈ కోస్తా కాపులు కేవలము 150 యేండ్ల నుండి మాత్రమే కాపులుగా పిలుచుకుంటున్నారు.

Комментарии

Информация по комментариям в разработке