కర్ణుడు, అర్జునుడు - వీరిలో మహావీరుడు ఎవరు? | Karna and Arjuna | Rajan PTSK

Описание к видео కర్ణుడు, అర్జునుడు - వీరిలో మహావీరుడు ఎవరు? | Karna and Arjuna | Rajan PTSK

మహావీరుడు ఎవరు? కర్ణుడా? అర్జునుడా?
మనకు మహాభారతంలో చాలామంది వీరులు కనబడతారు. ధర్మపక్షంవైపు నిలబడ్డవారిలో అర్జునుడు, భీముడు, సాత్యకి, ద్రుపదుడు, దృష్టద్యుమ్నుడు మొదలైనవాళ్ళు, అధర్మపక్షంవైపు నిలబడ్డవారిలో భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ మొదలైనవాళ్ళు వీళ్లంతా ప్రధానమైన వీరులు. నిజానికి ఇంకా చాలామందే ఉన్నారు అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేది కర్ణుడు, అర్జునుడు వీరిద్దరిలో మహావీరుడు ఎవరు అన్న విషయం గురించి కాబట్టి నేరుగా వారి వద్దకే వెళదాం. మనలో కొంతమంది భారతానికి సంబంధించి ఎవో కొన్ని కథల్ని వినో, కర్ణుడిపై వచ్చిన సినిమాలు చూసో మహాభారతం మొత్తంలో కర్ణుడి కంటే గొప్ప వీరుడు లేడని వాదిస్తూ ఉంటారు. కర్ణుడు గొప్ప వీరుడే అందులో ఏమాత్రం సందేహం లేదు. అనేక దివ్యాస్త్రాలు సంపాదించిన ఘనుడే. అయితే ఒక వీరుని ప్రతాపం ఎంతటిదో లెక్క వెయ్యాలంటే మనం అతను పరాక్రమించిన సందర్భాలను చూడాలి. కురుపాండవుల విద్యాభ్యాసం పూర్తయ్యాక ఒక సభ చేసి వాళ్ళ వాళ్ళ శస్త్రాస్త్ర ప్రావీణ్యాన్ని చూడాలనుకుంటారు భీష్మద్రోణాది పెద్దలంతా. ఆ సందర్భంలోనే కర్ణుడి పాత్ర ప్రధానంగా తెరమీదకు వస్తుంది. నిజానికి కర్ణుడి ప్రస్తావన అంతకు ముందే భారతంలో వచ్చినా, అసలు కథలో అతని ప్రయాణం మాత్రం ఇక్కడనుండే మొదలవుతుంది. అయితే సినిమాలలో చూసినట్టుగా ఆ సమయంలో కర్ణుడేమీ అక్కడ తన అస్త్ర విద్యను ప్రదర్శించడు. తన విలువిద్యా ప్రదర్శనం చేసే అవకాశం కర్ణునికప్పుడు రాలేదు. అయితే కర్ణుడు అర్జునుడిని ఎదిరించి నేను నీకంటే గొప్ప వీరుడినని పలకడం దుర్యోధనుడికి గొప్ప ఆనందాన్నిచ్చింది. నిజానికి దుర్యోధనుడికి భీముడన్నా, అర్జునుడన్నా లోపల చాలా భయంగా ఉండేది. కర్ణుణ్ణి చూశాక ఇతడు అర్జునుడిని ఎదుర్కోగలడన్న నమ్మకం కలిగింది. దానితో అతణ్ణి తన దగ్గరే ఉండేలా చేసుకోవాలనుకున్నాడు. అందుకే కర్ణునికి అంగరాజ్యాన్ని కట్టబెట్టి తన స్నేహితునిగా చేసుకున్నాడు. కర్ణుడు తనకు రాజ్యాధికారాన్నిచ్చిన దుర్యోధనుడి కోరికపై అతని ఆప్త మిత్రుడిగా తుది శ్వాసవరకూ నిలిచాడు.

ఇక కర్ణుడు, అర్జునుడు వివిధ సమయాలలో ఎటువంటి పరాక్రమాన్ని చూపించారో చూద్దాం. మనం చెప్పుకునే విషయాలన్నింటికీ వ్యాస మహాభారతమే ప్రామాణికం.

Комментарии

Информация по комментариям в разработке