Ananda Nilalyam

Описание к видео Ananda Nilalyam

#ab6news
#AnanadaNilayam
#OldAgeHome
#Dr.KvRamanaChary

ఆనంద నిలయం :    • Ananda Nilalyam #Old Age Home | వృద్ధ...  
ఆనంద నిలయంలో అద్భుతం :    • Ananda Nilayam |Bhagavad Gita| ఆదర్శం...  
’’ఆనందనిలయం‘‘ ట్రస్ట్ సభ్యులు పెద్ది వైకుంఠంగారి ఫోన్ నంబర్ 9440003943 నంబర్ సంప్రదించవచ్చు...

వృద్ధాశ్రమం కాదు..ఆనంద నిలయం..కష్టాలు మరిపించి..సంతోషాన్ని నింపే దేవాలయం #AnandaNilayam #ab6news


హైదరాబాద్ మహానగరానికి సరిగ్గా 70 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేట జిల్లా లోని కొండపాక శివారులోని కొమురవెళ్లి కమాన్‌కు కిలోమీటర్ దూరంలో అటవీ ప్రాంతం ఉంది.. 2010కి ముందు ఇదంతా ఓ అటవీప్రాంతమే...వ్యవసాయానికి కూడా పనికిరాని ఈ స్థలం నేడు మమతలకు నిలయంగా మారింది...సిద్దిపేట చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు పెద్ది వైకుంఠం తన బాల్య మిత్రుడైన ప్రస్తుత తెలంగాణా ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏఎస్ డాక్టర్ కెవి రమణాచారిని కలిశారు..కన్న పిల్లల నిరాదరణకు గురై తల్లడిల్లే వృద్ధుల కోసం ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పానికి శ్రీకారం చుట్టారు..వీరికి మరో మిత్రుడు కోట రాధాకృష్ణశర్మ కూడా తోడయ్యారు...ఇలా ఒకరికొకరు తోడుగా ఆలోచన చేసి వ్యవసాయేతర భూమిగా ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంచుకుని దాదాపు 100 ఎకరాలు కొనుగోలు చేశారు..

హౌసింగ్ బోర్డు కమిషనర్ గా ఉన్న డాక్టర్ కెవి రమణాచారి ఈ సత్కార్యానికి ముందుపడి తన సతీమణి లత రమణాచారిని ఇందులో భాగస్వాములను చేశారు... మొత్తంగా ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు మొదలుపెట్టారు.. ముందుగా ట్రస్ట్ లో ఉన్నవారు తమ సంపాదనలో కొంత భాగాన్ని ఆశ్రమానికి కేటాయిస్తూ ముందుకు నడిపించారు...ఇక టీటీడీలో ఇవోగా పనిచేస్తున్న సమయంలో స్వామివారి భక్తురాలు బెంగళూరు చెందిన సుధా జనార్థన్ సేవ చేయాలన్న ఆలోచనను రమణాచారికి తెలియజేయడంతో తాము చేపట్టిన మహా సంకల్పాన్ని వివరించారు..ఇందుకు ఆ మానవతామూర్తి వెంటనే సత్కార్యానికి తన వంతుగా ఆ రోజుల్లోనే 50లక్షల భారీ విరాళాన్ని అందజేశారు...ఇక అప్పటివరకు ఒక్కో పనిపూర్తి చేస్తున్న ట్రస్ట్ సభ్యులకు విరాళాలు రావడంతో ఆనంద నిలయ స్థాపనకు మార్గం సుగమమం చేసుకున్నారు...

తాము కొనుగోలు చేసినదాంట్లోంచి 12 ఎకరాలకు పైగా వ్రుద్దాశ్రమానికి కేటాయించడంతో విశాలమైన గదులతోపాటు ఆనంద నిలయం ఆఫీస్‌ భవనం, అటాచ్డ్‌ బాత్‌రూంలతో విశాలమైన గదులు నిర్మాణం చేశారు..ఇక ఆయా గదుల్లో భార్యాభర్తలకు వసతి కల్పిస్తున్నారు...ఒంటరి మహిళలు, పురుషులకు వేర్వేరు గదులున్నాయి.. ఆ గదుల్లో వారికి కాలక్షేపం కోసం టీవీలు..ధార్మీక పుస్తకాలతో పాటు దినపత్రికలు కూడా అందుబాటులో ఉంచారు...ప్రస్తుతం ఆశ్రమంలో దాదాపు 40 మంది వరకు ఉన్నారు..మరో 60 మందికి సరిపడా కొత్తగా గదులు నిర్మాణం చేశారు.. ఏసీ గదులతో పాటు నిర్మాణం చేస్తూనే ప్రక్రుతి రమణీయమైన బ్రందావనాన్ని ఏర్పాటు చేస్తున్నారు...ఇక ఉదయాన్నే వేడినీళ్లతో స్నానాలు మొదలుకుని టీలు..కాఫీలు, టిఫిన్లు,భోజనాలు, అల్పాహారాలు..ఇలా సమయానికి వారికి అందించేందుకు అన్నీ ఏర్పాట్లు ఉన్నాయి...సాయంత్రం వేళల్లో భజనతో పాటు ధ్యానం కూడా ఉంటుంది... అత్యవసరానికి దాతలు అందించిన ఓ అంబులెన్సు అందుబాటులో ఉంటుంది ...ప్రతీ నెలనెలా వైద్య పరీక్షలు జరుగుతుంటాయి..

ఆనందనిలయం నిర్విఘ్నంగా కొనసాగుతుండగా అమ్మానాన్నలు లేని అనాథల కోసం ఇదే ఆశ్రమానికి పక్కనే అనాథబాలల ఆనందనిలయాన్ని కూడా నిర్మించారు...ప్రస్తుతం ఇందులో 50మందికిపైగా చిన్నారులున్నారు.. చదువుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు....ఇక ఇప్పటికే వెంకటేశ్వరస్వామివారి ఆలయం నిర్మాణం చేయగా... కొత్తగా ఓ దాత విరాళంతో అష్టాదశశక్తిపీఠాలతో భారీగా ఆలయనిర్మాణం జరుగుతుంది...మరోపక్కనే గోశాల నిర్మాణమయింది...

ఇదీ ఆనందనిలయం... ముదిమి వయస్సు చేరిన అమ్మానాన్నలు కన్నబిడ్డలవుతారనే సత్యాన్ని తెలుసుకోలేక పోతున్నారు కొందరు...పసిబిడ్డలతో సమానంగా వారిని చూడాలి...ప్రేమను అందించాలి...తోడుగా ఉండాలి... ఆప్యాయతను చూపించాలి...ఇలా అమ్మానాన్నలకు అమ్మానాన్నలయి వారిని చూసుకోవాల్సింది పోయి కష్టాలు పెట్టి...కన్నీళ్లు పెట్టించడంతో ఇలా ఆశ్రమాలు వెతుక్కుంటున్నారు...ఆశ్రమాల్లో ఆనందం దొరుకుతుంది..కొత్త పరిచయాలు..తోడుగా నిలిచేవారుంటారు..కాని రక్తసంబంధమైన ప్రేమ దొరకదు కదా... ఒక్కసారి ఆలోచించండి.. మనం చేస్తున్న తప్పు తెలుసుకుంటే అమ్మానాన్నలకు ఇలాంటి పరిస్థితి రాకుండా ఉంటుందేమో....

Комментарии

Информация по комментариям в разработке