దృవ చరిత్ర - 1 | Solid history -1 | Dhruva Story | EducationalContent | MoralValues |DhruvaNakshatra

Описание к видео దృవ చరిత్ర - 1 | Solid history -1 | Dhruva Story | EducationalContent | MoralValues |DhruvaNakshatra

దృవ చరిత్ర - 1 | Solid history -1| Dhruva Story | | EducationalContent | MoralValues |DhruvaNakshatra | DhruvaStory | InspiringTales | MythologyForKids | EducationalContent | MoralValues | DhruvaNakshatra | IndianMythology | KidsEntertainment

పట్టుదల, ప్రయత్నం లేకుండా ఎవరూ ప్రముఖులు కాలేరన్నది నగ్న సత్యం . చీకటి రాత్రుల్లో ఉత్తర దిక్కున ఆకాశం వైపు ఓ చూపు సారించండి. నల్లని ఆకాసంలో మిల మిల మెరిసే నక్షత్రాల సరసన మరింత ప్రకాశవంతం గా ఓ నక్షత్రం కనబడుతుంది. దాన్నే ధ్రువ నక్షత్రం అంటారు. ఆ దృవుడు ఆ నక్షత్రాల మద్య ఎలా ఉన్నాడు?. దానికి అతని పట్టుదల, ఓర్పు, కార్య దీక్ష ఎలా ఉపయోగపడిందో తెలుసుకోవాలంటే ఆ దృవుడు ఎవరు? అన్న విషయం తెలుసుకోవాలి కదా! మరి ఆ దృవుని చరిత్ర ఏమిటో మన చిన్ని చానల్ లో విని తరించేద్దాం రండి.
ఉత్తనపాదుడనే రాజు ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు. ఒకామె పేరు సునీత, రెండవ భార్య పేరు సురచి. ఆ రాజుకి మొదటి భార్య సునీత అయితే, రెండవ భార్య సురచి. మొదటి భార్య అయిన సునీత సౌమ్యురాలు, నెమ్మది, భర్త పట్ల ప్రేమ, భాద్యతగా నడుచుకుంటూ మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది. సురచి మాటలు, చేతలు చాలా దురుసు. అంతే కాదు ఆమె ఓ పెద్ద అహంకారి. అందువల్ల ఇటు ప్రజలు గాని, అటు రాణీ వాసంలో ఉన్న వారు కూడా సురచి అంటే పెద్దగా గౌరవించరు. సునీత కొడుకు దృవుడు, సురచి కొడుకు ఉత్తముడు. దృవుడు, ఉత్తముడులో ఉత్తముడు చిన్నవాడు, దృవుడు పెద్ద వాడు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వారి మద్య ఎలాంటి భావ భేదాలు ఉండేవి కావు.
ఉత్తానుపాదుడు ఒక భార్య ఉండగా రెండవ భార్యను పెళ్ళాడడంతో మొదటి భార్యమీద ప్రేమ తగ్గి రెండవ భార్యని పెళ్లి చేసుకున్నాడు. రాజుగారికి సునీత మీద ప్రేమ తక్కువ, సురచి మీద మక్కువ ఎక్కువ. అంతే కాకుండా సురుచి మాయమాటలతో రాజుగారిని లొంగదీసుకోవడం, భయపెట్టడం లాంటివి చేసేది. సురచి మాయమాటలతో తనవైపు రాజుగారిని తిప్పుకునేది. దాంతో సురచి మీద మొగ్గు చూపుతూ సునీత మీద నిర్లక్ష్యం వహిస్తూ సునీతని తక్కువగా చూసేవాడు. సురుచి మాయలో పడ్డ రాజు, తన పెద్ద కుమారుడైన దృవుని సహితం నిర్లక్ష్యంగా చేసేఉండేవాడు. అతని మీద వాత్సల్యం కూడా తగ్గిపోసాగింది. సురుచి కైక లాంటిది. పెద్ద భార్య అయిన సునీత కోడకైన దృవునికి రాజ్యం ఎక్కడ దక్కుతుందో అని భయపడి, తన కొడుకైన ఉత్తముని తండ్రికి దగ్గర చేయసాగింది. సునీత మీద, ఆమె కొడుకైన దృవుని మీద లేనిపోని చాడీలు చెబుతూ ఉండేది సురుచి. ఎలాగైనా రాజ్యం తన కొడుకు అయిన ఉత్తమునికే దక్కాలన్న కోరికతో రగిలిపోతుండేది సురచి. ఆ ప్రయత్నంలో దృవుని ఎలా తండ్రికి దూరం చెయ్యాలా అని నిత్యం అలొచిస్తూ ఉండేది. అయిదేళ్ళ ప్రాయంలో ఉన్న దృవునికి సవతి తల్లి మాయలు గాని, తన తల్లి నిరాదరణ గురి అవుతున్న సంగతి గానీ తెలియనే తెలియదు. మంచి వాళ్లకు లోకమంతా మంచి గానే కనపడ్డట్టు, తన పిన్ని మంచిగానే అనిపించేది దృవునికి. సునీత మీద అనేక ఆరోపణలు చేస్తూ రాజుగారికి సునీత ని దూరం చేసేది. ఇటువంటి విషయాలు చెప్పి పసి మనసులో విషం నింపడం ఇష్టంలేక దృవునికి చెప్పేది కాదు తల్లి సునీత. కల్మషం లేని పసి వయసుని స్వచ్చంగా ఉంచాలన్న సదుద్దేశ్యంతో, కొడుకు మనసు బాద పడనీకుండా సునీత జాగ్రత్త పడుతూ వచ్చేది. అయిననూ దృవుడు కొన్ని విపత్కర పరిస్తితులు ఎదుర్కోవలసి వచ్చేది....ఎటువంటి విపత్కర పరిస్తితులు దృవుడు ఎదుర్కున్నాడో తదుపరి విభాగంలో మన చిన్ని ఆశ చానల్ లో విని ఆనందిద్దాం రండి ...మన చిన్ని ఆశ చానల్ లో విని తరించండి

Title: The Story of Dhruva – Episode 1 | Inspiring Mythological Stories for Kids

Welcome to our channel! 🌟 In this series, we bring you the inspiring story of Dhruva, a young boy who became a shining star through his determination, perseverance, and faith. In this first episode, we introduce you to the royal family of King Uttanapada, his two wives, Suniti and Suruchi, and their sons, Dhruva and Uttama.
Witness how the dynamics within the family and the injustice faced by Dhruva set him on an extraordinary journey. This mythological tale not only entertains but also teaches children important values like determination, humility, and patience.
Stay tuned for more episodes as we unfold the life of Dhruva and his incredible transformation into Dhruva Nakshatra – the North Star! 🌠

Don’t forget to like, share, and subscribe to our channel for more educational and inspiring stories for kids!

#DhruvaStory
#kidsstories
#mythologyforkids
#indianmythology
#moralstories
#inspirationalstories
#determination
#KingUttanapada
#SuruchiAndSuniti
#SanskritiStories
#HinduMythology
#ChildrenAnimation
#dhruvanakshatraserial
#StoryOfDhruva
#educationalvideos

Комментарии

Информация по комментариям в разработке