వీర కేశవ జన్మమే మన భారతావని పుణ్యము song/rss songs/

Описание к видео వీర కేశవ జన్మమే మన భారతావని పుణ్యము song/rss songs/

వీర కేశవ జన్మమే మన భారతావని పుణ్యము
మహిలోన హిందూ జాతికే ఒక దివ్య జీవన మంత్రము

ఒకనాడు భారతజాతిరా జగదేక గురువై యుండియు
తన యాత్మ విస్మృతి చేతనే ఈనాడు పతనము చెందగా
ఘనవీరతా గంభీరతాయుత త్యాగభావన జ్యోతితో
గాఢాంధకారము బాపగా మన సంఘకార్యము జూపిన

మన మాతృదేశపు సేవకై ఒక నూత్న మార్గము జూపుచు
నిజ భారతాంబిక పూజకై అజరామరంబగు దీక్షతో
యువ జీవితంబులె పూలుగా ఒక సంఘమాలిక గూర్చిన
ఒక పూవుగా వెలుగొంది దేవికి పూజ సల్పిన నేతయౌ

దివినుండి గంగను దించిన భగీరథునిలో దీక్షయూ
తన ప్రాణమే త్యజియించిన దధీచిమునివరు త్యాగము
ఘనలోక సంగ్రహ శక్తియు ఎనలేని శౌశీల్యంబునూ
తనలోననే విలసిల్లగా తపమాచరించిన యోగియౌ

Комментарии

Информация по комментариям в разработке