అణుమాత్రపు దేహినంతే నేను ll Anumatrapu Song ll Annamayya Keerthanalu ll Annamayya Song with Lyrics

Описание к видео అణుమాత్రపు దేహినంతే నేను ll Anumatrapu Song ll Annamayya Keerthanalu ll Annamayya Song with Lyrics

- Singer : Hemachandra


రాగము: సామంతం
రేకు: 0260-05
సంపుటము: 3-347

॥పల్లవి॥అణుమాత్రపు దేహినంతే నేను
ముణిఁగెద లేచెద ముందర గానను

॥చ1॥తగు సంసారపు తరఁగలు నీమాయ
నిగమముల యడవి నీమాయ
పగలునిద్రలు వుచ్చే భవములు నీమాయ
గగనపు నీమాయఁ గడవఁగ వశమా

॥చ2॥బయలువందిలి కర్మబంధములు నీమాయ
నియమపుఁ బెనుగాలి నీమాయ
క్రియ నిసుకపాఁతర కెల్లొత్తు నీమాయ
జయమంది వెడలఁగ జనులకు వశమా

॥చ3॥కులధనములతోఁ జిగురుఁగండె నీమాయ
నిలువు నివురగాయ (?) నీమాయ
యెలమితో శ్రీవేంకటేశ నీకు శరణని
గెలుచుటఁ గాక యిది గెలువఁగ వశమా


#AnnamayyaSongsAVRG
#Anumatrapu

Комментарии

Информация по комментариям в разработке