Quotation : Behind the story | Ep-14 Thummeti Raghothama Reddy

Описание к видео Quotation : Behind the story | Ep-14 Thummeti Raghothama Reddy

Quotation:
Behind The Story
by
Thummeti Raghothama Reddy
episode 14
#quotes #motivation #life #quoteoftheday #inspiration #motivationalquotes #quote #inspirationalquotes #like #success #positivevibes #happiness #selflove #lifestyle #believe #happy #mindset #goals #lifequotes #soulspace
.
.
-
శ్రీ తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు మొదటి నుంచి సాహిత్య రంగంలో ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ వచ్చారు.

మార్పులకు అవకాశం లేదనుకున్న ఘనీభవించిన సాహిత్యరంగానికి తన అనుభవంతో కొత్త మార్గం చూపించారు .

వారి కథల్లో ఎక్కడా ఒక ఎక్సట్రా పదం వుండదు. సాన పెట్టిన బంగారంలా వుంటాయి వారి రచనలు.మట్టిని మంచి కుండలా మలచడం లాంటిది రచయిత బాధ్యత అంటారు వారు.

ఎటూ ఒదగకుండా అన్నింటినీ చూస్తూ ఎప్పుడూబ్యాలెన్స్డ్ గా వుండే రఘోత్తం గారు సాహితీ రంగంలోఅందరికీ ఆదర్శం.

చదివిన కొద్దీ ఎన్నో కొత్త అర్థాలు గోచరించే అద్భుత రచనలువారివి.

కథల్ని చదివి రికార్డు చేసి క్యాసెట్ రూపంలో తీసుకొనిరావడం మొదటగా చేసి చూపించింది వారే.

ఒక నిబద్ధత గల రచయిత కు జీవితం, సాహిత్యరంగం వేరు వేరు కావు. మనం జీవించే జీవితమే సాహిత్యంగా రాయాలి, అదే ప్రమాణం అని నమ్మి దాన్ని త్రికరణ శుద్ధిగా అనుసరిస్తున్న అతి కొద్ది రచయితల్లో రఘోత్తం గారు ఒకరు.

సమాజ రుణం తీర్చుకోవడం అన్న విషయంలో కాళీ పట్నం రామా రావు గారు వీరికి ఆదర్శం.

కొత్తగా కథలు రాసే వారిని ప్రోత్సహించడం అందులో మెలుకువలు నేర్పడంవారి ప్రత్యేక గుణం. ఎవరు కథలు రాయగలరు అని తెలుసుకొనే శక్తి వారిలో వుంది.

వారు ఫేస్ బుక్ మీద వచ్చిన విభిన్న రచనలు, వాటి వైవిద్యం, వాటి సంఖ్య బహుశా దేశ చరిత్రలో ఒక రికార్డు సృష్టించింది. అదొక కొత్త ఒరవడి.

కొత్త తరం వాళ్లకు తేలిగ్గా రీచ్ అవ్వడానికి వారు కొటేషన్స్ ప్రక్రియ ఎన్నుకున్నారు.

సాహిత్య రంగంలో జీవిస్తూ ఒక సైంటిస్ట్ లాగా దానిలోనే భిన్న ప్రయత్నాల్ని చేస్తున్న ఒక ఋషితుల్యుడు మన రఘోత్తం గారు.

ప్రతి రంగంలో వారు వెలిబుచ్చే అభిప్రాయాలకు వేదిక "గుడ్ మార్నింగ్" శీర్షిక ఎందరికో అది ఒక దారి చూపించింది. ఎందరి సమస్యలకో అది ఒక పరిష్కారం అయ్యింది.

వారు కోటేషన్స్ పైన మాట్లాడటం, దాని నేపథ్యం మనతో పంచుకోవడం అనేది గొప్ప ఆలోచన. అది మనం అందరంచూసి, తెలుసుకొని
నేర్చుకోవాల్సిన ఉత్తమశీర్షిక అవుతుంది అనడంలో ఏ మాత్రం అనుమానం లేదు.అందులో మనమూ భాగం పంచుకొని మనలోకి జ్ఞానం ఒంపుకుందామా

~డాక్టర్. విజయమోహనరెడ్డి.

Комментарии

Информация по комментариям в разработке