PM Modi Face Of A Corrupt System | Rahul Gandhi At Congress Yatra Ends మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు

Описание к видео PM Modi Face Of A Corrupt System | Rahul Gandhi At Congress Yatra Ends మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు

ED, EVMలు, సీబీఐ, ఐటీల సాయం లేకుండా ప్రధాని మోదీ ఎన్నికల్లో గెలవలేరనీ అవినీతిపై ఆయనదే గుత్తాధిపత్యమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ముంబయిలో భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభలో ప్రసంగించిన ఆయన.. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, విద్వేషాలను చూపేందుకే యాత్ర చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సభకు హాజరయిన ఇండియా కూటమి నేతలు.. ఈ ఎన్నికల్లో కేంద్రంలో అధికారం తమదేననీ లౌకిక, సమ్మిళిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఎన్నికల బాండ్లతో భాజపా అవినీతి బయటపడిందని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. ఈ పదేళ్లలో విదేశీ పర్యటనలు, దుష్ప్రచారం తప్ప మోదీ వేరే ఏం చేయలేదన్నారు. విపక్షాలను అవినీతిపరులుగా ముద్ర వేయడం ప్రారంభించారని మండిపడ్డారు. దేశంలో మార్పు తేవాల్సిన అవసరం ఉందని, భాజపాను కలిసికట్టుగా గద్దె దించాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సూచించారు. తమ పోరాటం విద్వేష భావజాలంపైనే గానీ మోదీ, షాలపై కాదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. ప్రజలు ఏకమైతేనే నియంతృత్వం అంతం అవుతుందని UBT శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. దేశ రక్షణకే తాము ఏకమయ్యామని, రాజ్యాంగ మార్పు కోసమే భాజపా 400కుపైగా సీట్లు కావాలంటోందని జమ్ము కశ్మీర్ నేతలు.. ఫరూక్ అబ్దుల్లా, ముఫ్తీ పేర్కొన్నారు. జైలుకెళ్లేందుకు తమకు భయం లేదని అందుకే ఐక్యంగా ఉన్నామని దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ వివరించారు. కుట్ర చేసి తన భర్తను జైల్లో పెట్టారని ఝార్ఖండ్ మాజీ CM, హేమంత్ సోరెన్ సతీమణి కల్పన ఆవేదన వ్యక్తం చేశారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке