ధనమా దైవమా యోచించుమా (Dhanama Daivama yochinchuma) - SFJ SONG

Описание к видео ధనమా దైవమా యోచించుమా (Dhanama Daivama yochinchuma) - SFJ SONG

#latestchristiandevotionalsongs #teluguchristiansongs #SFJ #jesusteluguworshipsongs #sfjsongs #dhanamadaivama #soldiersforjesus

CREDITS:
Script: Bro. Mahesh SFJ
Music and lyrics: Mani Prakash
Vocals: Lillian Christopher
Sponsors: HC Sambayya - Glory (HYD)
Video: Bro. Sagar SFJ

పల్లవి
ధనమా దైవమా యోచించుమా - ప్రియ నేస్తమా క్రైస్తవ జనాంగమా
సిరికినీ దేవునికి దాసులుగా ఉండ దగునా ప్రభువు మెచ్చునా
ధనాపేక్షను చంపి వేయుము
మోక్ష రాజ్యమున చోటు పొందుము //ధనమా//

చరణం 1
భూ సంపదలన్నియు క్షయమైపోయే ధనం
పర సంబంధమైనదే అక్షయమైన ధనం - 2
ధనముకు హృదయమునిచ్చినచో
అది విగ్రహారాధన కాదా ?!
భువిపై నుండగనే పరలోక ధనాన్ని కుర్చుకో - 2
ఆత్మల రక్షణకై నమ్మకముగ ధనమును వాడుకో //ధనమా//

చరణం 2
పాత నిబంధన దీవెనలు తాత్కాలికమైనవి
నూత్న నిబంధన దీవెనలు శాశ్వతమైనది - 2
యాత్రికులము పరదేశులమని
పితరులు గుడారమందుండిరి
పాప భోగముగ సిరులను ఎంచి ఐగుప్తునే విడిచిరి
అల్పకాల సుఖముల విడిచి క్రీస్తును వెంబడించిరి //ధనమా//

చరణం 3
ధనవంతులైన వారికి పరలోకం దుర్లభం
ప్రభువును వెంబడించిన నూరు రెట్లు ఫలం - 2
దేవుని ప్రేమించు పరిశుద్ధులు
నిత్య జీవముకు పాత్రులు - 2
ధనాపేక్ష విడిచి కీడుల నుండి తప్పించుకో
అన్న వస్త్రములతో తృప్తిగ జీవించ నేర్చుకో //ధనమా//

చరణం 4
ఆది సంఘము ఆస్తులు విడిచి ధనవంతులైరి ఆత్మలో
భూములను సంపాదనలమ్మి ఆత్మల సంపాదించిరి - 2
వెండిని పసిడిని విడిచిరి పరిశుద్ధాత్మను పొందిరి - 2
క్రీస్తు సిలువను మించినది లేదని నిజముగ నమ్మిరి
కలిమిని వ్యర్థముగానెంచి జీవ కిరీటము పొందిరి //ధనమా//


All rights reserved to SFJAPTS

Комментарии

Информация по комментариям в разработке