తెలంగాణ సర్వీస్ వర్కర్స్ యూనియన్ - TSWU

Описание к видео తెలంగాణ సర్వీస్ వర్కర్స్ యూనియన్ - TSWU

తెలంగాణ సర్వీస్ వర్కర్స్ యూనియన్ - TSWU ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల్ , రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రాల్లో స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయా ల్లో గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికుల సమావేశం నిర్వహించడం జరిగినది
( గ్రామ సందర్శనలో భాగంగా నాయనోనిపల్లి , టంకర విశ్వనాథ్ పూర్ మరియు చెరుకుపల్లి గ్రామాల పారిశుద్ధ కార్మికుల తో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం జరిగినది)
ఈ యొక్క సమావేశానికి " ముఖ్య అతిథులుగా కర్ణాటక సర్వీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమన్వయకర్త శ్రీ మల్లికార్జున గారు హాజరైనారు.
తెలంగాణ సర్వీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మట్టగళ్ళ వెంకటయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బి నాగన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి TSWU ,
జిల్లెల ప్రభుదాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ వ్యవసాయ వృత్తిదాల యూనియన్ గారు , శ్రీమతి డి వెంకటేశ్వరమ్మ రాష్ట్ర మహిళా కార్యదర్శి tvvu గారు రంగారెడ్డి జిల్లా యూనియన్ ప్రతినిధి మల్లెపాగా శ్రీనివాసులు గారు వివిధ గ్రామాల నుండి పారిశుద్ధ కార్మికులు టంకర లక్ష్మయ్య , రావిర్యాల యాదయ్య , లక్ష్మమ్మ , మాదాపురం జంగయ్య, బైరంపల్లి శ్రీను , విశ్వనాథపూర్ నర్సింలు నరసయ్య కృష్ణయ్య చెరుకుపల్లి రాములు, శేఖర్, నరసింహులు మొదలగు వారు పాల్గొన్నారు.
కార్యక్రమంలో కార్మికుల సమస్యల గూర్చి చర్చించడం జరిగినది .
ఏ పంచాయతీలో కూడా కనీస వేతనాలు అమలులో లేవు ఇస్తున్న అతి తక్కువ వేతనాల్లో కూడా ఒక వ్యక్తి తీసుకుంటున్న జీతభత్యాలలో ఇద్దరూ ముగ్గురు నలుగురు కు షేర్ చేయడం , జరుగుతున్నదని, అతి తక్కువ వేతనాలు కూడ రెగ్యులర్ గా ఇవ్వడం లేదని కార్మికులు తెలియజేయడం జరిగినది .
కర్ణాటక సర్వీస్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు శ్రీ మల్లికార్జున గారు మాట్లాడుతూ కర్ణాటకలోని పారిశుద్ధ కార్మికుల స్థితిగతులు వివరించారు సమస్యలు ఒకే విధంగా ఉన్నప్పటికీ వేతనాలు సీనియార్టీని బట్టి పెంపుదల చేయడం జరుగుతుందని వివరించారు.
రాష్ట్ర అధ్యక్షులు మట్టగళ్ళ వెంకటయ్య గారు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పట్ల చట్టబద్ధంగా పోరాడేందుకు తెలంగాణ సర్వీస్ వర్కర్స్ యూనియన్ పనిచేస్తుంది ఇదివరకే పంచాయతీ మండల పరిషత్ జిల్లా పరిషత్ మరియు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లడం జరిగినది తక్షణ పరిష్కారాలు జరగకుంటే చట్టబద్ధంగా ప్రజావాజ్యం వేయాల్సి ఉంటుందని అన్నారు.

ఏ అశోక్ కుమార్
తెలంగాణ సర్వీస్ వర్కర్స్ యూనియన్ - TSWU

Комментарии

Информация по комментариям в разработке