Nepal PM Pushpa Kamal Dahal Prachanda Loses Vote Of Confidence In Parliament

Описание к видео Nepal PM Pushpa Kamal Dahal Prachanda Loses Vote Of Confidence In Parliament

నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. 275 సీట్లు కలిగిన నేపాల్ పార్లమెంటులో ప్రభుత్వ ఏర్పాటుకు 138 ఓట్ల మెజార్టీ అవసరం. ప్రచండ ప్రభుత్వానికి మద్దతుగా 63 మంది నిలవగా, వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి. మాజీ ప్రధాని కె.పి.శర్మ ఓలికి చెందిన పార్టీ మద్దతు ఉపసంహరణతో ప్రభుత్వం కూలింది. నేపాల్ ప్రధానిగా డిసెంబర్ 25, 2022లో పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ బాధ్యతలు చేపట్టారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రచండ ఇప్పటికే 3 సార్లు అవిశ్వాసం ఎదుర్కొన్నారు. అయితే, నేపాలీ కాంగ్రెస్ తో ముందస్తుగా చేసుకున్న అధికార బదలాయింపు ఒప్పందం ప్రకారం ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. అందుకు ప్రచండ నిరాకరించడంతో అవిశ్వాసం అనివార్యమైంది. నేపాలీ కాంగ్రెస్ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, సీపీఎన్ -యుఎంఎల్ కు 78 మంది సభ్యుల బలం ఉంది. వీరిద్దరూ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. తదుపరి ప్రధానిగా ఓలి బాధ్యతలు చేపట్టేందుకు నేపాలీ కాంగ్రెస్ అంగీకరించినట్లు సమాచారం. నేపాల్ లో గడిచిన పదహారేళ్లలో 13 ప్రభుత్వాలు మారాయి.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке