ఆడ రావే చెల్లెలా బతుకమ్మ పాట 2020 | Full Song | Mittapalli Surender | Mangli | Anthadupula Nagaraju

Описание к видео ఆడ రావే చెల్లెలా బతుకమ్మ పాట 2020 | Full Song | Mittapalli Surender | Mangli | Anthadupula Nagaraju

#బతుకమ్మపాట2020 #MittapalliSurender #Mangli #Anthadupula Nagaraju
#Iptatelangana #Ipta

రచన & గానం : మిట్టపల్లి సురేందర్
గాయని : మంగ్లీ
సంగీతం - కళ్యాణ్
కెమెరా : శివని నవీన్
ఎడిటింగ్ : ఉదయ్ కుంభం
దర్శకత్వం : అంతడుపుల నాగరాజు
నిర్వహణ : రేగుంట చంద్ర శేఖర్
నిర్మాత : కలవేణ శంకర్

చినుకు చినుకు కలిసి వాన అయ్యిందే
వాన జల్లు పెరిగి వరద అయ్యిందే
వరుస కట్టి వరద చెరువు చుట్టిందే
ఆకాశానికే చెరువు అద్దమయ్యిందే....

చెరువు నిండా నీరు నిండి ఉన్నాది
చెట్ల మీద పూల సంపదున్నాది
అల్లిపూలు కళ్ళు తెరుచుకున్నాయి
తెంచుకో చెల్లి అని తలలు వంచాయి

కొమ్మలే అమ్మలై.. పువ్వుల బిడ్డల్ని
కనిపెంచినాయమ్మ బతుకమ్మ పూజకై...

ఆడరావే చెల్లెలా... బతుకమ్మ ఈయేడు
పాడరావే బతుకమ్మ... పాటల్ని ఈనాడు

ఆడరావే చెల్లెలా... బతుకమ్మ ఈయేడు
పాడరావే బతుకమ్మ... పాటల్ని ఈనాడు

గంధాన్ని గుమ్మడి తీగ అందిస్తే
పారాణిగా పసుపు కొమ్ము కదిలొస్తే
కనకాంబరం నుదుట కుంకుమలు ఇస్తే
ముత్తైదువుగ తనను ముస్తాబు చేస్తే
పూరిగుడిసేల నుండి ఊరి వాడల నడుమ
తల మీద బతుకమ్మ తరలిపోతుంటే......

ఆడరావే చెల్లెలా... బతుకమ్మ ఈయేడు
పాడరావే బతుకమ్మ... పాటల్ని ఈనాడు

ఆడరావే చెల్లెలా... బతుకమ్మ ఈయేడు
పాడరావే బతుకమ్మ... పాటల్ని ఈనాడు

సంగిడిని చీరలా చుట్టుకున్నాది
రంగులను రవికల తొడుగుకున్నాది
పూలతో సుగుణాలు ఒలికించి తనలో
గునుగునే నగలుగా పొదుగుకున్నాది

కోట్లాది పువ్వుల కోలాట కేళిలో
ఆగి ఆగి ఆడే బతుకమ్మ ఆటలో.....

ఆడరావే చెల్లెలా... బతుకమ్మ ఈయేడు
పాడరావే బతుకమ్మ... పాటల్ని ఈనాడు

ఆడరావే చెల్లెలా... బతుకమ్మ ఈయేడు
పాడరావే బతుకమ్మ... పాటల్ని ఈనాడు

అందాల ఆడకూతురు పెండ్లికోసం
అక్షింతలై వచ్చే పువ్వులా లోకం
పంటసేలతో ఉన్న ఆత్మసంబంధం
పలహారమై వచ్చే నువ్వుల బెల్లం
పువ్వుల రాణికి చెరువు మహారాజుకి
పొలిమేరలో జరిగే బతుకు పండుగలో.....

ఆడరావే చెల్లెలా... బతుకమ్మ ఈయేడు
పాడరావే బతుకమ్మ... పాటల్ని ఈనాడు

ఆడరావే చెల్లెలా... బతుకమ్మ ఈయేడు
పాడరావే బతుకమ్మ... పాటల్ని ఈనాడు

Комментарии

Информация по комментариям в разработке