Sai Gurukulam Episode1379 //శ్రీసాయి శరీరాన్ని వదిలి ఆనంద స్వరూపంగా ఎలా మారారో తెలుసుకొండి.

Описание к видео Sai Gurukulam Episode1379 //శ్రీసాయి శరీరాన్ని వదిలి ఆనంద స్వరూపంగా ఎలా మారారో తెలుసుకొండి.

Sai Gurukulam Episode1379 //శ్రీసాయి శరీరాన్ని వదిలి ఆనంద స్వరూపంగా ఎలా మారారో తెలుసుకొండి.

చదువరు లింతవరకు బాబా జీవితకథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినెదరుగాక. 1918 సెప్టెంబరు 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము రెండు మూడు దినము లుండెను, కాని అటుతరువాత బాబా భోజనమును మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్చోబరు 15వ తేదీ మంగళవారము 2-30 గంటలకు బాబా భౌతిక శరీరమును విడిచెను. ఈ విషయమును రెండు సంవత్సరములకు ముందే బాబా సూచించెను గాని, యది యెవరికి బోధపడలేదు. అది యిట్లు జరిగెను. విజయదశమినాడు సాయంకాలము గ్రామములోని వారందరు సీమోల్లంఘన మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘన మనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫనీ, లంగోటీ తీసి వానిని చించి ముందున్న ధుని లోనికి విసిరివైచిరి. దీని మూలముగా ధుని యెక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరుడై నిలచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా అరచెను. "ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో, మహమ్మదియుడనో చెప్పుడు." అచటనున్న ప్రతివాడు గడ గడ వణకిపోయెను. బాబా వద్దకు పోవుట కెవ్వరును సాహసించలేకపోయిరి. కొంతసేపటికి భాగోజి శిందే (కుష్ఠురోగ భక్తుడు) ధైర్యముతో దగ్గరకు బోయి లంగోటును గట్టి యిట్లనెను. "బాబా! సీమోల్లంఘనమునాడు ఇదంతయునేమి?" "ఈ రోజు నా సీమోల్లంఘనము." అనుచు బాబా సటకాతో నేలపై గొట్టెను. బాబా రాత్రి 11 గంటలవరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి యుత్సవము జరుగునో లేదో యని యందరు సంశయించిరి. ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటివలె దుస్తులు వేసికొని చావడి యుత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరానాడు సమాధి చెందుదుమని సూచించిరి గాని అది యెవరికి అర్ధము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరియొక సూచన గూడ చేసిరి.

Комментарии

Информация по комментариям в разработке