6 AM Khichdi Mutton Paya In Guntur |Mutton Kabab | Early Morning Mutton Khichdi |Guntur | Food Book

Описание к видео 6 AM Khichdi Mutton Paya In Guntur |Mutton Kabab | Early Morning Mutton Khichdi |Guntur | Food Book

మాంసాహార వంటకాలతో తృప్తికర అల్పాహార విందు అందించే గుంటూరులోని ఓల్డ్ బాషా హోటల్ ను నేను ఈ వేళ మీకు పరిచయం చేయబోతున్నాను.

100 ఏళ్ల ఘన కీర్తి ఉంది ఈ శాలకు.ప్రారంభకులు బాషా గారు కాగా ఇప్పుడు మూడోతరం వారు నిర్వహణ చేస్తున్నారు.

ఇచ్చట ఆహార నాణ్యతకు నిదర్శనం ఈ ప్రతిచ్చాయ. అనేక వంటకాలతో ఉన్న దృశ్యం.ఎంత కనువిందు గా ఉందో మీరే చూడగలరు.

సద్భావ వీక్షణమే కాదు సంతృప్తికర ఆస్వాధన కూడా లభిస్తుంది ఈ వంటకాలతో.

ఆహారాల నేపద్యాన్ని ఇప్పుడు వివరిస్తాను. తొలుతగా మటన్ కబాబ్.

చిన్న ముక్కలతో కాస్త పులుసు,మరికాస్త మసాలా గుజ్జు కలిగి ఉంటుంది కబాబ్.

తింటున్నప్పుడు ఘాటు తగలకుండా తగువిధంగా అల్లంవెల్లుల్లి, దాల్చిన చెక్క,యాలుకలు వంటి సాధారణ మసాలాతోపాటు నాణ్యమైన గుంటూరు కారం వినియోగించి సోనామసూరి బియ్యంతో తయారు చేసిన కిచిడిని అరిటాకులో అందిస్తారు.కిచిడికీ గొంగుర కలగల్పి మటన్ కబాబ్ తో అందిస్తే కమ్మని రుచి నోటి అంతటా ఆవహిస్తుంది.

ఇచ్చట ప్రత్యేకంగా గోధుమ పిండితో చేసిన రొట్టెలు లభిస్థాయి.ఆ రొట్టె అంతటా మటన్ పాయ పులుసు నింపి బాగా నానిన తర్వాత మటన్ కబాబ్ జోడించి తింటే పంటి క్రింద మెత్తగా నలిగిన మిళితాహారం వైవిధ్య రుచిని నాలుకకు అందించి సుతారంగా జారుకుంటుంది బొజ్జలోకి.

ఇక్కడ అల్పాహార విందు పట్ల సంపూర్ణ సంతృప్తి వ్యక్తం చేస్తూ శతాబ్దము చరిత్ర గల ఆహార శాల గూర్చి కార్యక్రమం చేస్తున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను.

చిరునామా:-OLD Basha Hotel
https://maps.app.goo.gl/A962jjssWNjem...

Комментарии

Информация по комментариям в разработке