Parliament Session | Lok Sabha Adjourned Till Monday Amid Ruckus Over NEET

Описание к видео Parliament Session | Lok Sabha Adjourned Till Monday Amid Ruckus Over NEET

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ అంశంపై పార్లమెంటు ఉభయసభలు దద్ధరిల్లాయి. విపక్షాల ఆందోళనతో లోక్ సభ సోమవారానికి వాయిదాపడింది. ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా ...విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు తమ స్థానాల నుంచి లేచి...నీట్ పై చర్చ జరపాలని డిమాండ్ చేశాయి. స్పీకర్ అందుకు అంగీకరించకపోవటంతో...విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల నినాదాలతో గందరగోళం నెలకొనటంతో... స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సమావేశమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవటంతో...సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. రాజ్యసభలోనూ అదే పరిస్థితి కొనసాగింది. విపక్ష ఎంపీల నినాదాలతో సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ...సభను వాయిదావేశారు. మళ్లీ సభలో ఇదే అంశంపై చర్చ ప్రారంభమైంది.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке