ఎండుచేపల కూర | Dry Fish Curry in Telugu | Enduchepala Pulusu | Fish Curry | Sea Food Recipes

Описание к видео ఎండుచేపల కూర | Dry Fish Curry in Telugu | Enduchepala Pulusu | Fish Curry | Sea Food Recipes

ఎండుచేపల కూర | Dry Fish Curry in Telugu | Enduchepala Pulusu | Fish Curry | Sea Food Recipes ‪@HomeCookingTelugu‬

ఈ ఎండుచేపల కూరలో మేము వంజరం ఎండుచేపలని వాడాము. మీరు దీనిబదులు వేరే ఏదైనా వెరైటీ కూడా వాడుకోవచ్చు. ఈ కూరని తయారుచేసిన పావు గంట తరువాత తినచ్చు, లేదంటే, ఎక్కువ రుచి కోసం మరుసటి రోజువరకూ ఉంచి కూడా తినచ్చు. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది.

#enduchepalapulusu #homecookingtelugu #dryfishcurry #homecooking #hemasubramanian

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

Here's the link to this recipe in English: https://bit.ly/3hBIOOz

తయారుచేయడానికి: 20 నిమిషాలు
వండటానికి: 40 నిమిషాలు
సెర్వింగులు: 4

కావలసిన పదార్థాలు:

ఎండు వంజరం చేప - 200 గ్రాములు
నువ్వుల నూనె - 3 టేబుల్స్పూన్లు (Buy: https://amzn.to/37oEDA0)
ఆవాలు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2GUoDKd)
మెంతులు - 1 / 4 టీస్పూన్ (Buy: https://amzn.to/2Sh0x1P)
వెల్లుల్లి రెబ్బలు
చిన్న ఉల్లిపాయలు - 1 కప్పు
కరివేపాకులు
ఉల్లిపాయ - 1 (తరిగినది)
అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/314FymX)
పచ్చిమిరపకాయలు - 2 (చీల్చినవి)
టొమాటోలు - 3 (తరిగినవి)
కల్లుప్పు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2Oj81A4)
పసుపు - 1 / 4 టీస్పూన్ (Buy: https://amzn.to/2RC4fm4)
ఎండుకారం - 4 టీస్పూన్లు (Buy: https://amzn.to/3b4yHyg)
వంకాయలు - 6
ములక్కాడలు - 2
చింతపండు రసం - 1 కప్పు (Buy: https://amzn.to/2Sh3kJG)
నీళ్లు - 2 కప్పులు

తయారుచేసే విధానం:

ఒక గిన్నెలో నీళ్లు పోసి, అవి బాగా మరిగిన తరువాత అందులో ఎండుచేపలని వేసి, మూత మూసేసి, కాసేపు పక్కన పెట్టుకోవాలి

ఒక మట్టి పాత్రలో నూనె, ఆవాలు, మెంతులు వేసి ఆవాలు చిటపటలాడిన తరువాత వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు, కరివేపాకులు, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఉల్లిపాయలు రంగు మారేంత వరకూ వేయించాలి

ఇందులో పచ్చిమిరపకాయలు, టొమాటోలు వేసి టొమాటోలు బాగా మగ్గిన తరువాత కల్లుప్పు, పసుపు, ఎండుకారం వేసి బాగా కలుపుకోవాలి

ఆ తరువాత కూరగాయలు వేసి ఐదు నిమిషాలు వేయించిన తరువాత చింతపండు రసం వేసి, నీళ్లు కూడా పోసి మరిగించాలి

పది నిమిషాల తరువాత ఎండుచేపల ముక్కలు వేసి, మూత మూసి పదిహేను నిమిషాలు ఉడికించాలి

ఉప్పు రుచి చూసి, కావాలంటే వేసి, ఇంకొక ఐదు నిమిషాలు కూరని ఉడికించి, పొయ్యి కట్టేసుకోవాలి

అంతే, ఎండుచేపల కూరని పదిహేను నిముషాలు అలానే కాస్త మగ్గనిచ్చి, వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది

You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES

WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK -   / homecookingtelugu  
YOUTUBE:    / homecookingtelugu  
INSTAGRAM -   / homecookingshow  

A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке