Kia Cars Industry | Vastly Changed the Face of Penukonda Constituency | Idi Sangathi

Описание к видео Kia Cars Industry | Vastly Changed the Face of Penukonda Constituency | Idi Sangathi

ఆ గ్రామాలన్నీ తీవ్ర వర్షాభావ, దుర్భిక్ష ప్రాంతాలు....వర్షాలుంటేనే గ్రామ వీధుల్లో రైతుల సంచారం కనిపిస్తుంది...చినుకు రాలకపోతే ఉపాధి వెతుక్కుంటూ వలసవెళ్లిపోయే బతుకులు వాళ్లవి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క పరిశ్రమ రాకతో వారి జీవన విధానమే మారిపోయింది. పరిశ్రమ స్థాపనతో ఏదో ఒక ఉపాధి దొరుకుందనే నమ్మకం అక్కడ ప్రతి రైతు కుటుంబానికి ధైర్యాన్ని నింపింది. భూమి ఇచ్చిన ప్రతి కుటుంబానికి కార్ల తయారీ పరిశ్రమలో ఉద్యోగం ఇస్తున్నారు. అనంత జిల్లాలో కియా కార్ల తయారీ సంస్థ కారణంగా పెనుకొండ నియోజకవర్గంలో ప్రజల జీవన విధానం ఒక్క సారిగా మారిపోయింది . వెనుకబడిన పెనుకొండ కొరియా వాసుల సంచారంతో నగరాల తరహా సౌకర్యాల కల్పన దిశగా ముందుకు పోతోంది . పదమూడు వేల కోట్ల రూపాయలతో ఏర్పాటవుతున్న పరిశ్రమ ఆ ప్రాంత రూపురేఖలనే మార్చేసింది...

Комментарии

Информация по комментариям в разработке