Karnataka Kukke Subramanya Swamy Temple

Описание к видео Karnataka Kukke Subramanya Swamy Temple

శ్రీ క్షేత్రాన్ని దర్శించే యాత్రికులు కుమారధార నదిని దాటి దేవస్థానాన్ని చేరుకోవాలి. సుబ్రమణ్యుని దర్శనానికి ముందు భక్తులు పవిత్ర కుమారధార నదిలో మునిగి రావటం ఆనవాయితీ.

దేవస్థానం వెనుక తలుపు గుండా భక్తులు గుడి ప్రాంగణాన్ని చేరుకుని మూలవిరాట్ చుట్టూ ప్రదిక్షిణలు చేస్తారు. మూలవిరాట్కు ముఖ్య ద్వారానికి మధ్య వెండి తాపడం చెయ్యబడిన గరుడస్తంభం ఉంది. వశీకరించబడిన ఈ గరుడ స్తంభం, లోపల నివాసం ఉన్న మహా సర్పం వాసుకి ఊపిరి నుండి వెలువడే విషకీలల నుండి భక్తులను కవచంలా కాపాడటానికి ప్రతిష్ఠించబడిందిఅని నమ్మకం. స్తంభం తరువాత బాహ్య మందిరం, అంతర మందిరం, సుబ్రమణ్య దేవుని గుడి ఉన్నాయి. గుడికి సరిగ్గా మధ్యలో పీఠం ఉంది. పీఠం పైన భాగంలో సుబ్రమణ్య స్వామి, వాసుకిల విగ్రహాలు, కింద భాగంలో శేషనాగు విగ్రహం ఉన్నాయి. ఈ విగ్రహాలకు నిత్య కర్మ ఆరాధన పూజలు జరుగుతాయి. పవిత్రత, ప్రాముఖ్యత వలన ఈ దేవస్థానం దినదిన ప్రవర్తమానం చెందుతూ చాలా వేగంగా అభివృద్ధి, ప్రజధరణ పొందుతున్నది.

Комментарии

Информация по комментариям в разработке