Telugu State CM's Meeting Concludes | Discussion on 10th Schedule in Bifurcation Act

Описание к видео Telugu State CM's Meeting Concludes | Discussion on 10th Schedule in Bifurcation Act

ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా.. విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని, తెలుగు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. విభజన వివాదాల పరిష్కారంపై హైదరాబాద్ ప్రజాభవన్‌లో దాదాపు రెండుగంటలపాటు చర్చించారు. ప్రధానంగా విభజన చట్టం షెడ్యూల్ 10లోని అంశాలపైనే చర్చ సాగింది. చర్చల కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తొలుత ప్రజాభవన్‌కు చేరుకుని, ఆ తర్వాత అక్కడికి వచ్చిన చంద్రబాబుకు....పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఏపీ మంత్రులను.. తెలంగాణ మంత్రులు సాదరంగా ఆహ్వానించారు. లోపలికి వెళ్లాక... చంద్రబాబుకు రేవంత్ రెడ్డి శాలువా కప్పి సన్మానించారు. కాళోజీ నారాయణరావు రాసిన "నా గొడవ" అనే పుస్తకాన్ని.... చంద్రబాబుకు బహూకరించారు. అనంతరం,... చర్చలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ నుంచి మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ప్రభాకర్ పాల్గొనగా.. ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్ సమావేశానికి హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు.. ముఖ్య విభాగాల ఉన్నతాధికారులూ పాల్గొన్నారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке