ఈశా మహేశ అమ్మను ఒక్కసారి చూపరాదా. eshaa maheshaa ammanu okasaari chuparada. లిరిక్స్ ఉన్నవి

Описание к видео ఈశా మహేశ అమ్మను ఒక్కసారి చూపరాదా. eshaa maheshaa ammanu okasaari chuparada. లిరిక్స్ ఉన్నవి

ఈశా మహేశా అమ్మను ఒకసారి చూపరాదా
రమ్మని నీవైనా చెప్పరాదా

శివరంజని రాగం. ఆది తాళం
గానం.నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా

సాకి

ఈశా.... మహేశా... పరమేశా....

పల్లవి

ఈశా మహేశా అమ్మను ఒక్కసారి చూపరాదా.
రమ్మని నీవైన చెప్పరాదా పాపను నాపైన జాలి లేదా
"ఈశా మహేశా అమ్మను ఒకసారి చూపరాదా"

చరణం 1

అమ్మపాలు త్రాగలేదూ అమ్మ ఒడిని ఊగలేదు
కమ్మనైన అమ్మ మాట కలనైనా వినలేదు"2",
అమ్మా అమ్మా యని ఎంత పిలచినా రాదు.
"ఈశా మహేశా అమ్మను ఒకసారి చూపరాదా"

చరణం 2

ప్రతికొమ్మకు రెమ్మ ఉంది అందరికి అమ్మ ఉంది
మురిపాలను తేలడా ముద్దు గణపతి
కొమరయ్యను లాలించగ తల్లి పార్వతి"2"
లేగ పిలుపు వినగానే గోమాత ఆగునా
కన్నబిడ్డ గోడు విని తల్లి మనస్సు దాగునా
"ఈశా మహేశా అమ్మను ఒకసారి చూపరాదా"

Комментарии

Информация по комментариям в разработке