భూకబ్జాల నిరోధక చట్టం తెచ్చాం: భూమి ఆక్రమిస్తే జైలుకే..||sagevideos || Sage tv..

Описание к видео భూకబ్జాల నిరోధక చట్టం తెచ్చాం: భూమి ఆక్రమిస్తే జైలుకే..||sagevideos || Sage tv..

#revenuerecord #assignmentland #news #sagevideo

భూకబ్జాల నిరోధక చట్టం తెచ్చాం: భూమి ఆక్రమిస్తే జైలుకే..

రెవెన్యూ సదస్సుల్లో అత్యధికంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలపై ఫిర్యాదులే వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో అత్యధికంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కబ్జాలపై ఫిర్యాదులే వస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. భూములు కబ్జా చేయాలంటే వణుకు పుట్టేలా చేస్తామన్నారు. ఒక్క సెంటు భూమి ఆక్రమించినా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సీఎం మాట్లాడారు. 'గత ప్రభుత్వంలో భూవివాదాలు సృష్టించి కబ్జాలు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములపై హక్కులు లాక్కునేందుకు ప్రయత్నించారు. నిషేధిత జాబితా 22ఏ కింద చేర్చి తక్కువ ధరలకు కొట్టేశారు' అని చంద్రబాబు ధ్వజమెత్తారు. మీ భూ సమస్యలు పరిష్కరించి, వాటిని తిరిగి అప్పగించి, ఎన్నికల్లో ఘన విజయం అందించినందుకు రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. '‘నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన ఫిర్యాదులు 1,57,481 ఉన్నాయి. వీటిలో భూ యాజమాన్య హక్కుల కోసం 78,854. భూ ఆక్రమణలపై 9,528.. 8,366 వచ్చాయి. సదస్సుల్లో 95,263 ఫిర్యాదులు అందాయి. అందుకే కబ్జాదారుల భరతం పట్టేలా భూకబ్జాల నిరోధక చట్టం తెచ్చాం. గత సీఎం ప్రచార యావతో సర్వే రాళ్లపై రూ.వేల కోట్లు ఖర్చు చేసి బొమ్మలు వేయించుకున్నారు. వీటిని తొలగించేందుకే రూ.12 కోట్లు ఖర్చయింది. రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయని ప్రజలు నమ్ముతున్నారు. నాకు అర్జీ ఇస్త పరిష్కరిస్తాననే విశ్వాసంతో అన్నమయ్య జిల్లా నుంచి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చిఅర్జీ ఇచ్చారు' అని సీఎం పేర్కొన్నారు.
16,816 గ్రామాల్లో 6,698 గ్రామాల్లో రీసర్వే చేయగా.. అనేక తప్పులు దొర్లాయి. 2,79,148 మంది ఫిర్యాదు చేశారు. వీటన్నింటినీ పరిశీలించి, సమస్యలు పరిష్కరిస్తాం. నా వరకు ఫిర్యాదులు వస్తే.. ఆయా శాఖలు పనిచేయడం లేదని భావిస్తా. రీసర్వే చేయిస్తాం. రెవెన్యూ రికార్డులను ఆధునికీకరిస్తాం' అని చంద్రబాబు చెప్పారు. అర్జీలు ఇచ్చిన ఐదుగురిని పిలిపించి మాట్లాడారు. ఆ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ బాలాజీకిసూచించారు.

#sagevideo #apgovernment #youtubevideos #telugu
#landrevenue #landregistration #tdpgovernment #telugunews

https://www.instagram.com/sage31jly?i...

https://www.facebook.com/share/UgRJHX...

https://x.com/ThullimelliK?t=MLgRjPfD...

Комментарии

Информация по комментариям в разработке