కోట వినూత డ్రైవర్ సంచలన వీడియో🚨
హత్యకు ముందు రికార్డ్ అయిన కోట వినూత డ్రైవర్ వీడియో..వీడియోలో సంచలన నిజాలు చెప్పిన డ్రైవర్ రాయుడు
సిహెచ్.శ్రీనివాసరావు (రాయుడు) 
2019 నుంచి వినీత వద్ద నమ్మకంగా పనిచేస్తున్నా
నవంబర్ నెలలో టీడీపీ పార్టీ ఆఫీస్ లో టీడీపీ , జనసేన సమన్వయ సమావేశం జరిగింది. జనసేన పార్టీ చంద్ర, సుధీర్ రెడ్డి మనిషి సుజిత్ కు నన్ను పరిచయం చేశారు. నా నెంబర్ సుజిత్ కు ఇచ్చారు. ఆ తర్వాత రోజు రేణిగుంట నుంచి శ్రీకాళహస్తికి వెళుతుంటే చంద్ర బస్టాండ్ వద్ద ఉన్నాడు. శ్రీకాళహస్తి ఎస్ఎస్ కళ్యాణమండపం వద్ద నేను చంద్ర కలిసి మందు తాగాం. మందు తాగుతున్నప్పుడు సుజిత్ ఫోన్ చేశాడా అని చంద్ర అడిగాడు, సుజిత్ ఫోన్ చేస్తే మేడమ్ గురించి వివరాలు చెప్పు అని చంద్ర నాతో చెప్పాడు, మేడమ్ వివరాలు చెబితే డబ్బులు ఇస్తామని చెప్పారు, మరుసటి రోజు నాకు సుజిత్ ఫోన్ చేసి చంద్ర ఏమైనా చెప్పాడా అని అడిగాడు, మేడమ్ వివరాలు చెబితే చంద్ర డబ్బులిస్తాడని సుజిత్ నాతో చెప్పాడు, ఎంత డబ్బులిస్తామని చెప్పాడు అని సుజిత్ నన్ను అడిగాడు, ఎంత ఇస్తామని చెప్పలేదు...ఫోన్ చేసి అడిగితే విషయాలు చెప్పమని చెప్పాడు, రెండు రోజుల తర్వాత ఎస్ఎస్ కళ్యాణమండపం వద్దకు రమ్మని చంద్ర నాకు ఫోన్ చేశాడు, నేను ఎస్ఎస్ కళ్యాణమండపం వద్దకు వెళ్లాను, అప్పటికే అక్కడ సుజిత్ , చంద్ర మందు తాగుతున్నారు, నన్ను కూడా తాగమని మందు పోశారు, సుజిత్ 30 లక్షలు ఇస్తాడు అతను అడిగినట్లు మేడమ్ వివరాలు చెప్పమని చెప్పారు, అంత డబ్బులు ఎందుకు అని నేను అడిగాను, సుజిత్ నాకు అప్పటికప్పుడే రెండు లక్షల రూపాయలు ఇచ్చాడు, ఆ రెండు లక్షలను పార్టీ ఆఫీస్ లో నా ర్యాక్ లో దాచుకున్నా,మేడమ్ ఎక్కడికి వెళ్తున్నారు..ఏం చేస్తున్నారో చెప్పమని సుజిత్ నాకు ఫోన్ చేశాడు, సుజిత్ అడిగినట్లు నేను అన్ని సమాచారాలు ఇచ్చాను, మేడమ్ టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారా అని అడిగారు, మేడమ్ ఎవరెవరితో మాట్లాడుతున్నారో అంతా చెప్పేశా, వచ్చే 15 ఏళ్లూ మేము ఇక్కడే ఉంటాం ఎవరూ ఏం చేయలేరని  సుధీర్ రెడ్డి మాట్లాడారు, ఆరు నెలల ముందు వచ్చి ఓవరాక్షన్ చేస్తున్నాడని అన్న వాళ్లు సుధీర్ రెడ్డిని తిట్టారు, సుధీర్ రెడ్డిని తిట్టిన ఆడియో వాయిస్ రికార్డ్ చేసి సుజిత్ కు పెట్టాను, రికార్డ్ ఎందుకు పెట్టావని చంద్ర నన్ను అడిగాడు, సుజిత్ పెట్టమంటేనే ఆడియో వాయిస్ రికార్డు పెట్టానని చెప్పాను. చిరంజీవి షాపు ఎదురుగా నేను , చంద్ర, సుజిత్ మాట్లాడుకున్నాం ,మేం మాట్లాడుకోవడాన్ని హేమంత్ , రాము చూశారు, ఎన్నికలైపోయాక నాకు డబ్బులు ఏమీ ఇవ్వలేదు, నాకు 30 లక్షలు ఇస్తామన్నారు ఇవ్వలేదేంటని చంద్రను అడిగాను, మరుసటి రోజు చంద్ర షాపు దగ్గరకి వెళ్లి మళ్లీ డబ్బులు అడిగాను, నాకు సుజిత్ 20 లక్షలు ఇచ్చాడు, 30 ఇస్తామని 20 లక్షలే ఎందుకు ఇచ్చారని అడిగాను?సుధీర్ రెడ్డితో మాట్లాడతాడు..ఇంకో పనిచేస్తే ఆయనే 30 లక్షలు ఇస్తాడని చెప్పారు, 20 లక్షలు తీసుకుని వెళుతుంటే నన్ను చంద్ర అడ్డుకున్నాడు, ఓ రెండు లక్షలు తీసుకుని ఊరెళ్లిపోయాను ...కొత్త సిమ్ తీసుకున్నా, మీ మేడమ్ , మీ సార్ ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి  చంపేయమని చెప్పాడని చెప్పారు, కారులో వెళ్లినప్పుడు రెండు సార్లు చంపడానికి ట్రై చేశా, కావాలని చేస్తున్నావంటూ మేడమ్ నన్ను తిట్టింది, అప్పట్నుంచి నాకు కారు ఇవ్వడం మానేశారు...డ్రైవర్ ను మార్చేశారు, 6వ తేదీన కోకాకోలా ఫ్యాక్టరీ వద్దకు రమ్మని ఫోన్ చేశారు, సుజిత్ , చంద్ర, నేను కోకాకోలా ఫ్యాక్టరీ వద్ద మందు తాగాం, తర్వాత రోజు మళ్లీ అదేచోట మందు తాగుతుంటే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చాడు, 19 వేలు ఇస్తా తన వద్ద పనిచేయమని సుధీర్ రెడ్డి అడిగాడు, నేను సుధీర్ రెడ్డి దగ్గరకు రానని చెప్పాను, నాదగ్గరకు రాకపోయినా పర్వాలేదు కానీ మీ మేడమ్ వీడియోలు తనకు పంపించమని అడిగాడు, పెద్దవాళ్లను ఎవరినైనా కలిసినా ఆ వీడియోలు తనకు ఇవ్వాలని సుధీర్ రెడ్డి అడిగాడు, వీడియోలిస్తే 60 లక్షలు ఇస్తారని సుజిత్ నాతో చెప్పాడు, వీడియోలు తీయమంటే ఎందుకు తియ్యలేదని 23వ తేదీన సుజిత్ నన్ను బెదిరించాడు, 26వ తేదీన ఇంట్లో ఎవరూ లేనప్పుడు మేడమ్ ఒక్కరే కూర్చుని ఉన్నారు, అక్కడ కూర్చున్నట్లే కూర్చుని నా ఫోన్ తో వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేశా, నా ఫోన్ కు వాట్సాప్ మెసేజ్ రావడంతో సౌండ్ రాడంతో మేడమ్ చూసేశారు..కానీ నన్నేమీ అడగలేదు, వీడియో తీయడానికి భయమేసి సుజిత్ కు ఫోన్ చేశా, మేడమ్ కు ఏం చెప్పావని నన్ను సుజిత్ అడిగాడు, నేను చెప్పలేదు నన్నేమీ అడగలేదని చెప్పా, నా పేరు, ఎమ్మెల్యే పేరు బయటపెడితే ఊరుకోమని బెదిరించారు, నేను వీడియో తీస్తూ దొరికిపోయానని చంద్రకు కూడా చెప్పా, ఎమ్మెల్యేకి కూడా మెసేజ్ పెట్టా ఎమ్మెల్యే రిప్లై ఇవ్వలేదు, నేను వీడియో తీశానని మేడమ్ తో చెప్పినా ఆమె నమ్మలేదు, నువ్వు ఇలా చేశావంటే నమ్మనని మేడమ్ చెప్పింది, చంద్ర దగ్గర డబ్బులు తీసుకుని ఎక్కడికైనా పారిపోదామనుకున్నా, నాలగవ తేదీ తెల్లవారు జామున ట్రై చేశా...కానీ అన్ని వైపులా డోర్లు లాక్ చేసేసున్నాయి, ఆరోజు మధ్యాహ్నం ఇంటి పై నుంచి దూకేశా నా కాలు విరిగింది, ఇక ఏం చేయలేక ఎమ్మెల్యే పేరు బయటపెట్టేశా.
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
                         
                    
Информация по комментариям в разработке