INDIA Bloc Plans Five Prime Ministers In Five Years | PM Modi | ఇండియా కూటమిపై మోదీ విమర్శల వర్షం

Описание к видео INDIA Bloc Plans Five Prime Ministers In Five Years | PM Modi | ఇండియా కూటమిపై మోదీ విమర్శల వర్షం

ప్రధానమంత్రి పదవిని సంవత్సరానికి ఒకరికి చొప్పున పంచాలని ఇండీ కూటమి నిర్ణయించిందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఆ కూటమికి నాయకుడు ఎవరన్న విషయంపై పెద్ద యుద్ధం జరుగుతోందన్నారు. కర్ణాటకలోని బాగల్ కోటే, మహారాష్ట్రలోని షోలాపూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోదీ.. గత పదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం నిజమైన సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని వివరించారు. వెనుకబడ్డ తరగతుల హక్కులను లాక్కోకుండానే జనరల్ కేటగిరీలోని ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేశామన్నారు. ఆ విధానం వల్ల దేశంలో వివిధ వర్గాల ప్రజల మధ్య ఏ విభజనా ఏర్పడలేదని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఓటు బ్యాంకు కోసం దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని యోచిస్తోందని ధ్వజమెత్తారు. SC, ST, OBCలు భాజపా వెంట ఉన్నందున.. కాంగ్రెస్ మైనారిటీలను ప్రసన్నం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. దళితులు, గిరిజనులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాపాడేందుకు తాను ఎంతకైనా తెగిస్తానని మోదీ ఉద్ఘాటించారు. విపక్ష నేతలు
సామాజిక అసమ్మతిని సృష్టించేందుకు ఫేక్ వీడియోలను తయారు చేస్తున్నారనీ, అలాంటి వీడియోలను షేర్ చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. నకిలీ వీడియోల నుంచి సమాజ రక్షణ అందరి బాధ్యతన్న మోదీ.. ఇలాంటి వీడియోలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...

☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va8R...
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Follow us :   / etvtelangana  
☛ Etv Win Website : https://www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке