రూపాయి కే అల్పాహారం అందిస్తున్న బామ్మ గారు | One Rupee Bonda | Bajji |Ongole | Food Book

Описание к видео రూపాయి కే అల్పాహారం అందిస్తున్న బామ్మ గారు | One Rupee Bonda | Bajji |Ongole | Food Book

సాటి మనిషి ఆకలి తీర్చడం దైవిక కార్యక్రమంగా భావిస్తారు ఒంగోలుకు చెందిన మల్లేశ్వరమ్మ గారు.

ఆకలిగుందని ఎవరు తమ గడపదొక్కినా బుక్కెడు బువ్వ బెట్టి క్షుబ్ధాధ తీర్చే మానవతా మూర్తి ఈ బామ్మ గారు.

ఆర్ధికంగా నిరుపేద కావచ్చు. మానవీయతలో వారు అపర కుబేరులు. కనుకనే భుక్తి కోసం ఏర్పాటు చేసుకున్న శాల ద్వారా గత రెండు దశాబ్దాల నుండి అల్పాహారాలను అతి తక్కువ ధరకే అందిస్తూ తమ సహృదయతను చాటుతున్నారు.


చిరునామా:-మాతా శిశు వైద్యశాల ఎదురు వీధి, భూపతి వీధి, ఒంగోలు.

గూగుల్ లొకేషన్:-
https://maps.app.goo.gl/fWX7rxEJkn6Vm...



శాస్ర్తీయ విధానంలో సాంప్రదాయ బద్ధంగా పొయ్యి మీద అల్పాహారాలను తయారు చేస్తారు.తొలుత పూజ కార్యక్రమం చేపట్టి తొలి అల్పాహారం నైవేద్యంగా సమర్పించి. మేలిమి గల ముడి పదార్థాలతో రుచి శుచి గల అల్పాహారాలు తయారు చేసి స్వల్ప ధరకే అందిస్తారు.

రూపాయి కే బోండా, పది రూపాయలకు ఏడు బజ్జిలు, మూడు గారెలు ఇంకా అనేక ఉపాహారాలను అత్యంత నాణ్యత తో అమ్మమ్మల కాలం నాటి రుచితో వండి వడ్డిస్తారు..



గమనిక:-ఉదయం అల్పాహార శాల ఉండదు.
సాయంత్రం 6.30 నుండి 8 గంటల వరకు శాల వేళలు.

Комментарии

Информация по комментариям в разработке