06.10.2024 చిన్నారి మరణం తల్లిదండ్రులకు తీరని శోకం: హోం మంత్రి వంగల పూడి అనిత ప్రెస్ మీట్

Описание к видео 06.10.2024 చిన్నారి మరణం తల్లిదండ్రులకు తీరని శోకం: హోం మంత్రి వంగల పూడి అనిత ప్రెస్ మీట్

06-10-2024 ఆదివారం చిత్తూరు జిల్లా పుంగనూరు*

బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి భరోసా

చిన్నారి తండ్రి తో ఫోన్ మాట్లాడి ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి


చిన్నారి మరణం తల్లిదండ్రులకు తీరని శోకం: హోం మంత్రి వంగల పూడి అనిత

ఇటీవల అదృశ్యమై హత్య కు గురైన చిన్నారి తల్లిదండ్రులను వారి కుటుంబాన్ని ఆదివారం పరామర్శించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగల పూడి అనిత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ లు...

కన్నీటి పర్యంతమైన చిన్నారి తల్లి ని ఓదార్చిన హోం మంత్రి వంగలపూడి అనిత ..

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...


➡️హోం మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్...


పుంగనూరుకు చెందిన చిన్నారి కేసులో ఎవరిని వదిలే ప్రసక్తే లేదు

చిన్నారి తల్లిదండ్రులకు భరోసా అందించాల్సిన సమయంలో మరింత బాధపెట్టడం సమంజసం కాదు

చిన్నారి కుటుంబానికి భరోసా కల్పించేందుకు మంత్రులు ఫరూఖ్, రాంప్రసాద్ రెడ్డి, నేను, ఇతర ప్రజా ప్రతినిధులు కలిసి వచ్చాం

గడిచిన ఐదేళ్లలో అత్యాచార, హత్యాచార నిందితులపై చర్యలు శూన్యం..


సంఘటన జరిగిన వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు .. చిన్నారిని సజీవంగా తల్లిదండ్రులకు అప్పగించేందుకు 12 బృందాలు, క్లూస్ టీంలు, డాగ్ స్క్వేడ్లు ఏర్పాటు చేశాం: హోం మంత్రి అనిత

దురదృష్టవశాత్తు చిన్నారి శవం స్టోరేజ్ ట్యాంకులో తేలడం అత్యంత బాధాకరం: హోం మంత్రి అనిత

చిన్నారి మరణం తల్లిదండ్రులకు తీరని శోకం: హోం మంత్రి అనిత

ఘటన జరిగిన వెంటనే ముగ్గురు నిందితులను పట్టుకున్నాం.. అది కూటమి ప్రభుత్వ విధానం

చిన్నారి ఘటన విషయం లో పోలీసుల పనితీరును ప్రశంసిస్తున్నాం

తమ కూతుర్ని హతమార్చిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన చిన్నారి తండ్రి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేరుగా బాధిత తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి భరోసా ఇచ్చారు.: హోం మంత్రి వంగలపూడి అనిత


✳️రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి కామెంట్స్...

ఈ సంఘటన దురదృష్టకరం.

ముక్కు పచ్చలారని చిన్నారిని పసిబిడ్డను దారుణంగా హత్య చేశారు.

అన్యంపుణ్యం తెలియని పసిబిడ్డ మృతికి చింతిస్తున్నాము..


ఈ ప్రభుత్వ హయాంలో చిన్నారుల పట్ల వివక్ష చూపించే వారికి కఠిన చర్యలు ఉంటాయి..

చిన్నారి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు..

చిన్నారి మృతిని రాజకీయ కోణంలో చూడొద్దని.. చిన్నారి పేరును పదేపదే సొంత మీడియా ఛానల్లో ప్రస్తావించి, అత్యాచారం జరిగినట్లు చిత్రీకరించడం భాదకరం.


⏩మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ కామెంట్స్ .

ఈ ఘటన బాధాకరం.

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ముఖ్యమంత్రి భరోసా.


🔸చిన్నారి తండ్రి తో ఫోన్ లో మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి.


సంఘటన వివరాలను చిన్నారి తండ్రి ముఖ్య మంత్రికి వివరించారు.


చిన్నారి అదృశ్యమైన అప్పటినుంచి పోలీసులు, అధికారులు, ప్రజా ప్రతి నిధులు ప్రభుత్వం మాకు అండగా ఉండి మా పాప ఆచూకీ కోసం ప్రయత్నం చేశారు:చిన్నారి తండ్రి.

ప్రభుత్వం మీద మాకు నమ్మకం కలదని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చిన్నారి తండ్రి ముఖ్యమంత్రికి విన్నవించారు


ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్ పి మణికంఠ చందోలు, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష,మాజీ మేయర్ కఠారి హేమలత, నాయకులు చల్లా రామ చంద్రారెడ్డి, ఇంతియాజ్ అహ్మద్,చిన్నబాబు, జై చంద్రారెడ్డి జగన్మోహన్ రాజు, ఇతర సంబంధిత అధికారులు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

---------///----------
సమాచార శాఖ, చిత్తూరు

Комментарии

Информация по комментариям в разработке