మాతృ భాష అవసరమా?

Описание к видео మాతృ భాష అవసరమా?

నమస్కారం అండి.
నా పేరు రవికాంత్ గరిమెళ్ళ.
నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.

1) ఆధునిక భాష శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ప్రకారం విద్యా భోధన కనీసం ప్రాథమిక స్థాయి వరకు అంటే ఎనిమిదవ తరగతి వరకు ఐనా విద్యార్థుల మాతృ భాషలోనే జరగడం మంచిది అని చెప్తున్నారు. ఈ విషయం మీద వేదం చదువుకున్న పండితులుగా మీ విశ్లేషణతో పాటు అభిప్రాయం ఏమిటి? అలాగే ఒక విద్యార్థికి విద్యాభ్యాసం చేయాల్సింది మాతృ భాషలోనా? లేక పర భాషలోనా? వేదం ఏం చెప్తుంది? వివరించగలరు.

2) వేదం చదివించడానికి ముందు ఆ విద్యార్థి ఏదైనా కనీస చదువు అంటే ఇప్పటి ఆలోచనలో ఐదవ తరగతి వరకు చదివి ఉండాలి? లేదా కనీసం మాతృ భాషలో కొంత చదవడం, వ్రాయడం వచ్చి ఉండాలి అనే నియమాలు వంటివి ఉన్నాయా? ఉంటే అవి ఏంటి? ఒకవేళ అటువంటి నియమాలు ఏవీ లేనట్లయితే ఒకప్పుడు అంటే క్రీస్తు శకం 12 వ శతాబ్దం తరువాత వేదం చదువుకున్న వ్యక్తులు తెలుగులోనూ ఇతర స్థానిక భాషలోనూ కవిత్వం, పాటలు, జ్యోతిష్య శాస్త్ర విషయలు వంటివి వ్రాయడానికి తెలుగును ఎలా నేర్చుకున్నారు? ఈ విషయమై మీరు ఎప్పుడైనా ఆలోచన గానీ పరిశోధన గానీ చేస్తే వివరించండి?


3) ఏ శాస్త్రం గానీ, కావ్యం గానీ, ఇతిహాసాది పురాణాలు ఏవైనా ప్రాచుర్యం పొందడానికి మన భారతదేశంలో ఏ భాష ఎక్కువగా తోడ్పాటును అందించింది? సంస్కృతం దేశం అంతటా సంస్కృతం చదువుకున్నవారిని అనుసంధానం చేస్తే స్థానిక భాషలైన తెలుగు,తమిళం వంటి భాషలు సంస్కృతం లో వ్రాయబడిన గ్రంథాలకు జన సామాన్యం లో ప్రాచుర్యం పొందడానికి ఉపయోగపడ్డాయా? ఈ విషయమై మీ విశ్లేషణ ఏమిటి?

[email protected]
[email protected]
[email protected]
www.vedas.univesity
www.vedasworld.org
www.vedas.world
www.vedas.wiki
www.vedas.us

#vedas #mothertongue #sanskrit #linguistics

Комментарии

Информация по комментариям в разработке