వరద బాధితులకు విరాళాల వెల్లువ | Aid Continues To Pour In Flood Victims | CMRF | Chandrababu

Описание к видео వరద బాధితులకు విరాళాల వెల్లువ | Aid Continues To Pour In Flood Victims | CMRF | Chandrababu

వరదలతో రాష్ట్రం కష్టాల్లో ఉన్న వేళ... ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. సచివాలయం నాలుగో బ్లాక్ లో మంత్రి నారా లోకేశ్ ను కలిసి విరాళాలు అందజేశారు. డిక్షన్ గ్రూప్ ప్రతినిధులు కోటి రూపాయలు విరాళమిచ్చారు. నెక్కంటి సీఫుడ్స్ సంస్థ ప్రతినిధులు కోటి రూపాయల చెక్కును మంత్రి లోకేశ్ కు అందజేశారు. శ్రీకాళహస్తి MLA బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు 25 లక్షల రూపాయలు విరాళమిచ్చారు. రేస్ పవర్ సంస్థ ప్రతినిధి సంజయ్ గుప్తా... 25 లక్షల విరాళం అందజేశారు. కర్నూలుకు చెందిన K.V.సుబ్బారెడ్డి కళాశాలల ఛైర్మన్ K.V.సుబ్బారెడ్డి... MLC రాంగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 11 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. హీరో సాయిదుర్గతేజ్... మంత్రి నారా లోకేశ్ ను కలిసి 10 లక్షల రూపాయల విరాళమిచ్చారు. ముప్పవరపు వీరయ్యచౌదరి 5 లక్షలు ఇవ్వగా... MLA భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో మంత్రి లోకేశ్ ను కలిసిన ఆల్ఫా ఇన్ స్టిట్యూట్ ప్రతినిధులు... 5 లక్షలు విరాళమిచ్చారు. రైతులు, కార్యకర్తలు కలిసి మరో 5 లక్షల రూపాయల చెక్కును మంత్రికి అందజేశారు. రక్ష హాస్పిటల్స్ నాగరాజు 5 లక్షలు ఇచ్చారు. పెద్ది వంశీకృష్ణ, పెద్ది విక్రమ్... మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. జర్నలిస్టు జాఫర్ లక్ష రూపాయలు విరాళమిచ్చారు. మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, దామచర్ల సత్య ఆధ్వర్యంలో మంత్రి లోకేశ్ ను కలిసిన సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధులు... కోటి రూపాయల విరాళమిచ్చారు. కొండెపి ప్రజలు, రైతుల తరఫున 6 లక్షల 80 వేల రూపాయల చెక్కు అందజేశారు. భీమవరపు శ్రీకాంత్ 2 లక్షలు, ఆశాబాల లక్షా 80 వేలు, V.జ్యోతి లక్ష రూపాయలు విరాళమిచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన అందరికీ మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке