మంచి స్నేహం తోటి,
సరైన సాంగత్యం తోటి,
జీవితం ఎంతో సారవంతంగా మారుతుంది!
అందుకే, పేరుకి జీవితం మనదైన,
దాని సిసలైన సారాంశం స్నేహితులది, కుటుంబానిది!
అలా, మేము ఎంతో గర్వ పడే, ఇష్ట పడే, స్ఫూర్తి పొందే స్నేహితురాలు 'మృణాళిని'!
తెలుగు సాహిత్య ప్రియులకు, మృణాళినిని పెద్దగా పరిచయం చేసే పని లేదు..
ఎందుకంటే,
హాస్యాన్ని, వ్యంగ్యాన్ని బాధ్యతతో బేరీజు వేస్తూ,
కోమలి గాంధారం,తాంబూలం,ఇంతి హాసం,విశ్వమహిళ,సకల వంటి
గొప్ప కథలని రాసిన రచయిత్రి...
రాసిన నవలలని కూలంకషంగా సమీక్ష చేస్తూ,
నవలకు కొత్త అందాన్ని తెచ్చే సమీక్షకురాలు..
గుల్జార్ కథలు,మాల్గుడి డేస్ ,ది మాంక్ హు సోల్డ్ హిజ్ ఫెర్రారి లాంటి రచనలని
తెలుగులోకి అత్యంత ఆసక్తికరంగా అనువాదం చేసి అమ్మకాలు పెంచిన అనువాదకురాలు.
హుందాతనాన్ని, హృద్యమైన సంభాషణల్ని మోస్తూ,
చక్కటి సంభాషణల్ని సమకూర్చే మంచి జర్నలిస్ట్, రేడియో ప్రయోక్త..
అన్నిటిని మించి మంచి వక్త..
అంతకన్నా మించి గొప్ప గురువు(పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఆచార్య పదవిని అలంకరించి అనేకమంది విద్యార్థులకు మార్గదర్శనం చేసిన అధ్యాపకురాలు)..
ఇలా వేసుకుంటూ పోతే, ఎన్ని వీరతాల్లో వేయొచ్చు
మృణాళిని ఆవిష్కరించేటప్పుడు!
'బహుముఖప్రజ్ఞాశాలి' , 'సకల కళా కోవిదురాలు', 'విదుషీమణి' అనే పదాలకి చక్కటి దర్పణం ఈ సాహిత్య రూపం..
ప్రముఖ వాగ్గేయకారుడూ,అన్నమయ్య పదాల పరిశోధకుడూ అయిన
రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారిని తాతగారిగా పొందిన ఘన వారసత్వం తనది.
సనాతన ఆచారాలకు నెలవైన కుటుంబంలో జన్మించినప్పటికీ,
అభ్యుదయ భావాలు పెంపొందించుకుని,
మానవ హక్కుల ఉద్యమ కార్యకర్తగా ఎదిగి ,
పేదప్రజల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసిన బాలగోపాల్ ని అన్నగా పొందిన ఘన నేపథ్యం కూడా తనదే!
అయినా ఈ నేపథ్యాన్ని తలుచుకోనవసరం లేకుండానే తన స్వయం శక్తితో ఎంతో ఎత్తుకు ఎదిగిన ప్రతిభ ఆమె సొంతం.
అలాంటి గొప్ప రచయిత, మాకు మంచి స్నేహితురాలు అవ్వడం
మాకెంతో ఆనందాన్ని తృప్తిని ఇస్తుంది..!
అందుకే, 'సంగీత సాహిత్య నైవైద్యం' కార్యక్రమంలో
మృణాళిని మించిన అతిధిని తీసుకోరాలేమని భావించాము..!
మృణాళిని ఛలోక్తులతో, చక్కటి అభిరుచులతో,
ఓ పసందైన కార్యక్రమం రూపుదిద్దుకుంది!
మా ముగ్గురి ఈ సాయంత్రపు సంభాషణలో,
మా స్నేహాన్నే కాక, సంగీతాన్ని, సాహిత్యాన్ని కూడా సత్కరించకలిగాము..
స్నేహం, సంగీతం, సాహిత్యం కలకలిసిన ఈ త్రివేణి సంగమాన్ని,
మీరందరు ఆస్వాదిస్తారని ఆశిస్తూ.. గురవా రెడ్డి, భార్గవి!
0:00 - Mrunaalini gaaru's introduction, bonding, and books
10:41 - Baapu movie songs
13:52 - Inthihaasam book and ladies directors and technicians
19:26 - Mrunali gaaru's songs
27:00 - Lyricists malladi gaari songs
29:00 - C Narayana Reddy songs
32:03 - Aarudra songs
34:00 - Sirivennela Songs
35:40 - Chandrabose songs
37:00 - Spandana radio programme
41:16 - Rafi songs
45:36 - Keeravani Songs
46:43 - Jikki songs
48:00 - Ghantasala songs
49:00 - Mrunaalini gaaru's favorite telugu writers
51:54 - Mrunalini gaaru's future ambitions
53:33 - Mrunalini gaaru as teacher
Информация по комментариям в разработке