Vaitheeswaran Koil - Nadi Jothidam | వైదీశ్వరన్ కోయిల్ నాడీ జాతకం చెప్పే స్థలం

Описание к видео Vaitheeswaran Koil - Nadi Jothidam | వైదీశ్వరన్ కోయిల్ నాడీ జాతకం చెప్పే స్థలం

#Vaitheeswaran #nadijathakam #hindutemple
ఆగష్టు 31 వ తేదీ 2024 శ్రావణ మాసం లో మహా మృత్యుంజయ హోమం జరపబడుతుంది , శ్రీ కాళహస్తి లో ఈ హోమం ఉంటుంది ,

మీరు మీ పేర్లు గోత్ర నామాలు నమోదు చేసుకోవచ్చు , మీరు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా నమ్మకం తో నిర్ణయం తీసుకోండి అలాగే అంతా శివయ్య మీద భారం వేసి అడుగు ముందు కు వేయండి అంత మంచే జరుగుతుంది ,.. పూర్తి వివరాల కోసం కాల్ చేయండి 7981961643

#వైదీశ్వరన్ కోయిల్ సాక్షాత్తు #పరమేశ్వరుడు వైద్యుడిగా వెలసిన పుణ్యక్షేత్రం ఈ #క్షేత్రం కావున ఈ క్షేత్రానికి #వైద్యనాదేశ్వర్ కోయిల్ అని పేరు వచ్చింది ..
ప్రతిరోజూ ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు మరియు సాయంత్రం 4 నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది..

ముందుగా ఈ దేవాలయం ఆవరణం లో జరిగే అద్భుతాల గురించి మనం తెలుసుకుందాం ఆ తర్వాత ఈ దేవాలయం కి మీరు ఎలా చేరుకోవాలి మీ ప్లేస్ నుండి ఈ ఆలయం కి ఎన్ని కిలో మీటర్ల దూరం ఉంటుంది అన్నది కూడా తెలుసుకుందాం ...

ఈ ఆలయం లో నవగ్రహాలలో ఒకరైన అంగారకుడి కి కూడా ప్రత్యేక ఆలయం ఉంటుంది, అయితే అసలు అంగారకుడిపై ఈ దేవాలయం కి సంబంధం ఏంటో తెలుసుకుందాం ...

అంగారకుడు ఎవరంటే శివుని కి అలాగే భూమి కి పుట్టిన పుత్రుడు ..
శివుని స్వేదం నుండి వచ్చిన తేజస్సు ను భూమాత గ్రహించడం ద్వారా పుట్టిన పుత్రుడు, ఇయన ఒక గ్రహానికి అధిపతి ,

వినాయకులవారు అలాగే సుబ్రమణ్య స్వామి అన్నదమ్ములు ఇక పార్వతి పరమేశ్వరుల కుమారులు వీరు ..

అయితే అంగారకుడి కి కుష్టు రోగం వస్తుంది , వెంటనే సుబ్రమణ్య స్వామి వారి దగ్గరకు వెళ్లి నయం చేయమని అడుగుతాడు అప్పుడు ఆయన నా వల్ల కాదు ఇదేంటో కూడా నాకు అర్థం కావట్లేదు , జ్ఞానం లో గొప్పవాడైన వినాయకుడి దగ్గరకు వెళ్దాం పదా ఆయన నయం చేయగలుగుతారేమో అని అంగారకుడిని వెంట పెట్టుకొని వినాయకుడి దగ్గరకు తీసుకెళ్తారు ,

అయితే వినాయకుల వారు ఈ సృష్టిలో ఏమిజరిగినా శివుడి ఆజ్ఞే ప్రతి దానికి ఎదో ఒకటి ఉంటుంది , అందుకే అంగారక నువ్వు వెళ్లి తండ్రి గారు అయినా శివుడిని కలువు ఆయనే నయం చేయగలరు అని చెప్తారు , వెంటనే కైలాసం బయల్దేరతారు అయితే శివుడి దగ్గరకు వెళ్ళగానే శివుడు నేను ఏమి చేయలేను అని చెప్పి పంపుతారు ..

సృష్టికి మూలమైన ఆయనే నేను నయం చేయను అని అన్నపుడు ఇంకెక్కడికి వెళ్ళాలి అని బాధపడుతుండగా సుబ్రమణ్య స్వామి గణపతి స్వామి ఇద్దరు అంగారకుడి దగ్గరకి వచ్చి , శివయ్య ను నువ్వే మెప్పించి ఈ జబ్బు నయం చేసుకో అని అంటారు .. అందుకు అంగారకుడు నేనెలా మెప్పించగలను అని అంటారు అందుకు వారు చెప్పిన మాట , తపస్సు ఆ శివుడి కోసం తపస్సు చెయ్యి భక్తుడి కోసం ఆయన ఏమైనా చేస్తారు , ఎంత దూరం అయినా వస్తారు , ఈ కుష్ఠు వ్యాధి నయం చేయలేరా అని చెప్తారు ,



Contact Mail: [email protected]
For Sponsors ( Phone Pay & Google Pay ): +917981961643

We are Providing : Travel videos, telugu traveller , telugu traveller videos , praveen telugu traveller , travel information,travel guide,telugu traveller praveen videos , latest videos , travel information and videos , all temples and information , travel guide information ,

ఈ ఛానల్ లో దేవాలయాలకు సంబందించిన వీడియో లు ఉంటాయి అలాగే మన దేశ చరిత్రకు సంబందించిన పురాతన కట్టడాలకు సంబందించిన వీడీయో లు సమాచారం కూడా మీకు అందిస్తాము.

Комментарии

Информация по комментариям в разработке