శ్రీభాష్యం వారి రామాయణప్రవచనం..RAMAYANA PRAVACHANAM BY SRI SRIBHASHYAM APPALACHARYA II DAY 1

Описание к видео శ్రీభాష్యం వారి రామాయణప్రవచనం..RAMAYANA PRAVACHANAM BY SRI SRIBHASHYAM APPALACHARYA II DAY 1

శ్రీభాష్యం వారి రామాయణప్రవచనం..RAMAYANA PRAVACHANAM BY SRIMAN SRIBHASHYAM APPALACHARYA II DAY 1 II ITHIHASA TV

ఇతిహాస రామాయణ ప్రవచనా యజ్ఞం
పునర్వసు నుండి పునర్వసు వరకు..
27 రోజుల వరకు రామాయణ ప్రవచనాలు..
లాక్ డౌన్ లో ప్రతీ ఇంటా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి..
-------------------------------------
అందరికీ నమస్కారం..
శ్రీరామనవమి సందర్భంగా పునర్వసు మొదలుకొని మళ్లీ పునర్వసు వరకు అంటే 02- 04 - 2020 నుండి 29 -04 - 2020 వరకు 27 రోజుల పాటు సంపూర్ణ రామాయణ ప్రవచనాలను అందరికీ అందించాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా పౌరాణిక బ్రహ్మ శ్రీ మల్లాది వారి రామాయణ దర్శనం అందించాం.ఇప్పుడు రామాయణ ప్రవచనమనగానే వెంటనే గుర్తుకువచ్చే పేరు మహామహోపాధ్యాయ శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యుల వారిదే, చాగంటి వంటి ఎందరో ప్రవచనకారులు శ్రీభాష్యం వారిని తమ ప్రవచనాల సమయంలో ఎప్పటికి స్మరించుకుంటారంటే వారి మధుర ప్రవచనం ఎంత గొప్పగా ఉంటుందో ఊహించవచ్చు, అటువంటి శ్రీభాష్యం వారి రామాయణ ప్రవచనాలను ఈ యజ్ఞం లో అందిస్తున్నందుకు ఆ సీతారామచంద్ర స్వామి వారికి, శ్రీభాష్యం వారికీ శిరసాంజలి ఘటిస్తూ ప్రతీ రోజు ఉదయం 5 గంటలకే ఈ ప్రవచనాలు అందిస్తాం‌. సన్నిహితులందరూ ఈ ప్రవచనాలను వినడానికి ఒక గంట సమయం కేటాయించగలరు. ఇంటింటా రామాయణం వెలుగొందాలన్నదే మా ప్రయత్నం. రామాయణ పారాయణం సకల ఆపత్ నివారణం కాబట్టి ప్రతీ ఇంటా ఈ ప్రవచనాలను వింటూ ఎవరి పనులు వారు యథారీతిగా చేసుకోగలరని కోరుతున్నాం. ఈ ఇతిహాస రామాయణ యజ్ఞంలో ప్రముఖ ప్రవచన కారుల రామాయణ ప్రవచనాలను అందించబోతున్నాం.
ప్రతీ ఒక్కరూ ఈ యజ్ఞం లో పాలుపంచుకోవాలని కోరుతున్నాం.

ప్రపంచమంతా కరోనా కబళిస్తున్న ఈ సమయంలో మనందరి ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్ఫుపెట్టి అహర్నిశలూ శ్రమిస్తున్న డాక్టర్లకు, పోలీసులకు, మున్సిపల్, మీడియా సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు.

ఇంటింటా రామాయణం ఆలకిద్దాం..
కరోనాసురుణ్ణి సంహరించమని ఆ శ్రీరాముణ్ని వేడుకుందాం..

ఈ ప్రవచన యజ్ఞం విషయాన్ని వీలైనంతమందికి షేర్ చేయండి.

అందరికీ ధన్యవాద్.
కృతజ్ఞతలతో..
ఇతిహాస టీమ్,
ఆధ్యాత్మిక భక్తి చానల్.

PLS FOLLOW THE LINKS:

► Subscribe to Youtube at:    / ithihasatv  
► Like us on Facebook :  / ithihasatv  
► Follow us on Instagram :   / ithihasatv  
► Follow us on Twitter :   / ithihasatv  

#ithihasa#RAMAYANAM#PRAVACHANAM#

Комментарии

Информация по комментариям в разработке