నా యేసు ప్రభు నీ కనికరము|Naa Yesu Prabhu|song-4|TPM Vijayawada convention2022|Lyrics Telugu 👇

Описание к видео నా యేసు ప్రభు నీ కనికరము|Naa Yesu Prabhu|song-4|TPM Vijayawada convention2022|Lyrics Telugu 👇

4. THY MERCY IS SO GREAT


పల్లవి : నా యేసుప్రభు నీ కనికరం ఎంతో గొప్పది .
నశించిపోయే నా ఆత్మను రక్షించితివి
నీ నిత్య సంకల్పము నాలో నెరవేర్చను
నిర్భోషమైన రక్తం నాకై కార్చితివి


1. నాశనకరమైన గుంటలో నుంటిని
నే మునిగితిని పాపపు ఊబిలో
నా యేసు నన్ను వెదకి నీ హస్తము చాపి
నన్ను లేవనెత్తి రక్తముతో కడిగితిని. -నాయేసుప్రభు
2. జగత్సునాదికి ముందే నన్నెరిగితివి .
జాలితో నీ ప్రేమ నాకు చూపితివి
ప్రేమలో పరిశుద్ధునిగా నన్ను మార్చుటకే
ప్రేమస్వరూపి యేసు నీ ప్రాణమిచ్చితివి. -నాయేసుప్రభు
3. నా ఆత్మ క్రుంగినవేళ నా చెయ్యి విడువక
నా వేదనలో నీవు ఎడబాయక
పాతాళంనుండి నన్ను లేవనెత్తితివి
పరిశుద్ధ మార్గంలో నడిపితివి నన్ను. -నాయేసుప్రభు
4. సహింపలేని నింద అవమానం కల్గెను
సమయోచిత కృప నన్ను కాపాడెను
నీ కనికరమే నన్ను స్వస్థపరచెన్
నీ ఆత్మ అనుదినం సంతోషం ఇచ్చెను. -నాయేసుప్రభు
5. మారని నీ సంకల్పం నాలో నెరవేర్చుము
మహిమ సన్నిధిలో నన్ను నిల్పు దేవా
సీయోను షాలేముగా నన్ను రూపించుము
శీఘ్రముగా రమ్ము మహిమలో చర్చను. -నాయేసుప్రభు

Please|Subscribe|Like|Comment|Share
@Voice of Ceylon Pentecost

Комментарии

Информация по комментариям в разработке