రోజూరోజూ రేగే | Love Song | Sri Soumya Varanasi | Yogee Qumaar | Nellutla Bhargava Krishna |

Описание к видео రోజూరోజూ రేగే | Love Song | Sri Soumya Varanasi | Yogee Qumaar | Nellutla Bhargava Krishna |

#BhargavaKrishnaNellutla
#SriSoumyaVaranasi
#KuhuKuhu

Roju Roju rege | Sri Soumya Varanasi | Yogee Qumaar | Nellutla Bhargava Krishna |

Roju Roju rege
రోజు రోజు రేగే
Film : Kuhu Kuhu
Singer : Sri Soumya Varanasi & Anil Nanduri

Lyrics by : Yegee Qumaar

Composer : Nellutla Bhargava Krishna



రోజు రోజు రేగే తలపులు నిన్నే చేరుకోగా..
నీకై తీసి ఉంచా తలుపులు నువ్వే చేరలేవా
గువ్వై వాలిపోనా.. నవ్వే పూయగా..
పువ్వై రాలిపోనా... నువ్వే చేరక ...
ఉంటా నీడగా.

రోజు రోజు రేగే తలపులు నిన్నే చేరుకోగా..
నీకై తీసి ఉంచా తలుపులు నువ్వే చేరలేవా...

కన్నులు కలవగానే ...చెంపలు తడచినవే దిగులు దీనికే
మనసులు తొణికినదే చెంపకు జారెనులే కనులు నిండగా
నీ వెంటే చేరుకుంటాగా ఈ వీచే గాలిలోనా
ఉదయించే వెలుగు లోన చిరు జల్లై చినుకు లోనా..
నా జంటై చెంత నుంటావా... కల కాలం కలసి పోగా.. కదలాడే మనసులోన ..
కురిపించే.. పూల వాన .
అతిధిగా విడువక ఆ ఆ ఆ ..


కమ్మని కోయిలనై ... ఝుమ్మని పాడితినీ .. ప్రియుడు చేరగా.
ఆమనీ తళుకులతో .. ఈ మణి మెరిసెను లే ..సొగసుమీటగా
పదిలంగా నిండి పోవేలా.. మదినిండా కొలువయేలా ..
ప్రతిజన్మ వరమయేలా.. తుది వరకు కథేయ్యేలా
క్షణమైనా వీడిపోలేక ..కనుపాపై ఉండిపోనా..
నిదురించే కనులలోన.. కలగానే విడిచిపోనా..

చెలిమిగా నిలువునా ..


రోజు రోజు రేగే తలపులు నిన్నే చేరుకోగా..
నీకై తీసి ఉంచా తలుపులు నువ్వే చేరలేవా
గువ్వై వాలిపోనా నవ్వే పూయగా
పువ్వై రాలిపోనా నువ్వే చేరాక
ఉంటా నీడగా.

రోజు రోజు రేగే తలపులు నిన్నే చేరుకోగా..
నీకై తీసి ఉంచా తలుపులు నువ్వే చేరలేవా

Комментарии

Информация по комментариям в разработке