చెట్ల కోసం స్పెషల్ అంబులెన్స్​లు.. స్పాట్​లోనే సర్జరీలు! || Tree ambulance service

Описание к видео చెట్ల కోసం స్పెషల్ అంబులెన్స్​లు.. స్పాట్​లోనే సర్జరీలు! || Tree ambulance service

#savetrees #Treeambulanceservice #saveearth

చెట్ల కోసం స్పెషల్ అంబులెన్స్​లు.. స్పాట్​లోనే సర్జరీలు! || Tree ambulance service

వృక్షాలను పరిరక్షించేందుకు తూర్పు దిల్లీ మున్సిపల్ కార్యక్రమం అంబులెన్సు సర్వీసులను ప్రారంభించింది. ఎండిపోతున్న చెట్లను, వ్యాధుల బారిన పడ్డ వృక్షాలను గుర్తించి వాటికి చికిత్స అందించేందుకు వీటిని వినియోగించనున్నారు.
చెట్ల సంరక్షణ కోసం తూర్పు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఎండిపోతున్న చెట్లను కాపాడుకునేందుకు అంబులెన్సు సర్వీసులను ప్రారంభించింది. దిల్లీ హైకోర్టు ఆదేశాల ప్రకారం ఉచిత అంబులెన్సు సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు తూర్పు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యానవన శాఖ డైరెక్టర్ రాఘవేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఎండిపోతున్న చెట్ల గురించి సమాచారం తెలుసుకొని, వాటిని కాపాడేందుకు సంరక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంబులెన్సులు చెట్ల దగ్గరికి వెళ్లి.. వాటిని పరీక్షిస్తాయని, చెట్లకు ఏవైనా వ్యాధులు వస్తే సరైన చికిత్స అందించి వాటిని బతికిస్తాయని వివరించారు.
అంబులెన్సులో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. చెట్లకు ఎలా చికిత్స ఇవ్వాలో నేర్పించాం. వ్యాధి బారిన పడ్డ చెట్లను నీటితో శుభ్రం చేసి.. మృత కణాలను తొలగిస్తాం. ఆ తర్వాత ఔషధాలు, ఎరువులు అందించి చెట్లను స్టెరిలైజ్ చేస్తాం. థర్మాకోల్​తో నింపిన ఇనుప కంచెను చెట్లు దెబ్బతిన్న చోట అమరుస్తాం. దానిపై పీఓపీ కోటింగ్ వేసి.. గాలి చొరబడకుండా చేస్తాం. తద్వారా లోపల చెట్ల కణాలు పెరుగుతాయి. వాటి కాండాలు బలంగా తయారవుతాయి. తూర్పు దిల్లీ కార్పొరేషన్ పరిధిలోని గార్డెనర్లకు సైతం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.
-రాఘవేంద్ర సింగ్, తూర్పు దిల్లీ మున్సిపల్ అధికారి
చెన్నైలో ఇప్పటికే ఇలాంటి ట్రీ అంబులెన్సులను ఉపయోగిస్తున్నారు. మొక్కలు, విత్తనాల పంపిణీ, చనిపోయిన చెట్లను తొలగించడం, వృక్షాలను ఒకచోటు నుంచి మరోచోటుకు మార్చడం వంటి పనుల కోసం వీటిని వాడుతున్నారు. భారీ చెట్లను పైకి లేపేందుకు ఇందులో హైడ్రాలిక్ యంత్రాలు సైతం ఉంటాయి. చెట్లకు వైద్యంతోపాటు స్థానిక ప్రజలకు పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు అంబులెన్స్ సిబ్బంది.
The East Delhi Municipal Corporation has launched ambulance services to protect the trees. These will be used to identify and treat withered trees and diseased plants.
The East Delhi Municipal Corporation has launched a special program for the care of trees. Launched ambulance services to protect drying trees. East Delhi Municipal Corporation Parks Director Raghavendra Singh said the free ambulance service was being made available as per the directions of the Delhi High Court.Knowing the information about the drying trees, he said that conservation measures will be taken to protect them. Ambulances would go to the trees and examine them, explaining that if the trees got any diseases, they would give proper treatment and keep them alive.

#etvbharatandhrapradesh
#apliveupdates
#aplatestnews


For more details please visit:

For more videos like this, please visit: https://www.etvbharat.com/telugu/andh...

Комментарии

Информация по комментариям в разработке