యాసంగి లో ఆరోగ్యవంతమైన వరి నారు పెంచుట లో మెలకువలు ||Rabi Paddy Nursery Management

Описание к видео యాసంగి లో ఆరోగ్యవంతమైన వరి నారు పెంచుట లో మెలకువలు ||Rabi Paddy Nursery Management

యాసంగి సీజన్లో వరి నారు పెంచేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎందుకంటే ఖరీఫ్ మరియు రబీ సీజన్ గాను సమయం తక్కువగా ఉండటము, చలి తీవ్రత ఎక్కువగా ఉండటము మరియు మంచు అధికంగా కురవడం వలన నారు అనేది ఎక్కువగా ఎదగదు కాబట్టి మనము నారుమడి నుండి మొదలుకుంటే నాటు వేసుకునే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది ముఖ్యంగా నారుమడిలో సేంద్రీయ మరియు రసాయన ఎరువుల మోతాదు, ఏ రసాయన ఎరువు ఎంత వేసుకోవాలి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ రసాయన ఎరువుల మోతాదును రెట్టింపు చేసి వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అదేవిధంగా నీటి యాజమాన్యం, కలుపు యాజమాన్యం చేపట్టడం, నారు ఎర్ర పడుట మొదలైన సమస్యలను గమనించి చేపట్టాల్సిన మెలకువలు పాటిస్తూ
ఆరోగ్యవంతమైనటువంటి నారును పెంచడం వలన ప్రధాన పొలంలో నాటు వేసినప్పుడు ఏపుగా పెరిగి, ఎక్కువ పిలకలు వేస్తుంది తద్వారా పంట దిగుబడి కూడా పెరుగుతుంది కాబట్టి రైతులు తప్పనిసరిగా నారుమడి ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


#farming #monitoring #integratedpestmanagement #సాగుబాట #aggriculture #vyavasayam #paddy #paddycultivation #paddy #rabivari

Комментарии

Информация по комментариям в разработке