ఖమ్మం జిల్లాలో ఎలాంటి విత్తనాల కొరత లేదని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్

Описание к видео ఖమ్మం జిల్లాలో ఎలాంటి విత్తనాల కొరత లేదని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్

ఖమ్మం, జిల్లాలో ఎలాంటి విత్తనాల కొరత లేదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి జిల్లాలో విత్తనాలు, వానాకాలం పంట సాగుపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వానాకాలం దగ్గర్లో ఉన్నట్లు, రుతుపవనాలు త్వరలో ప్రవేశించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల రోజులు రైతులకు ఎంతో కీలకమని, రైతులు సాగు పనుల్లో నిమగ్నమవుతారని అన్నారు. విత్తన డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ లతో వారం క్రిందట సమావేశం నిర్వహించి, విత్తన అమ్మకాలు, రైతులకు సహకారం పై దిశానిర్దేశం చేసినట్లు ఆయన అన్నారు. జిల్లాలో పోలీస్, వ్యవసాయ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేసి, ప్రతి విత్తన షాపును తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. అధీకృత విత్తన డీలర్లు రైతులకు, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరిస్తామని తెలిపినట్లు ఆయన అన్నారు. పత్తి 201834 ఎకరాల్లో సాగు అంచనా ఉన్నట్లు, ఇందుకై ఎకరాకు 2 ప్యాకెట్ల విత్తనాలు అవసరం కాగా, మొత్తంగా 4 లక్షల ప్యాకెట్లు అవసరం వున్నదని, 5 లక్షల 60 వేల ప్యాకెట్లను ప్రణాళిక చేసినట్లు, ఇప్పటికే జిల్లాకు 4 లక్షల 50 వేల ప్యాకెట్లు అందినట్లు, ఇంకనూ విత్తనాలు రవాణాలో జిల్లాకు వచ్చుటకు ఉన్నట్లు ఆయన అన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అన్నారు. పచ్చి రొట్టె విత్తనాలు జిల్లాకు 21 వేల 200 క్వింటాళ్ల కేటాయింపు జరగగా, 14 వేల క్వింటాళ్ల విత్తనాలు వచ్చాయని, ఇప్పటికి 11 వేల క్వింటాళ్ల విత్తనాలు అమ్ముడవగా, ఇంకనూ 3 వేల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో వున్నాయన్నారు. ఇంకనూ 7 వేల క్వింటాళ్లు త్వరలో వస్తాయన్నారు. విత్తనాలను ప్రభుత్వం 60 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తున్నదని ఆయన తెలిపారు. రైతులు పాస్ బుక్ తో వస్తే, రెండున్నర ఎకరాలకు ఒక బ్యాగ్ రైతులకు సబ్సిడీపై అందిస్తామన్నారు. షాపులలో సేల్స్ మెన్ పెంచుతామని ఆయన తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విత్తన విక్రయ కేంద్రాల్లో మౌళిక సదుపాయాల కల్పన చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో పోలీస్, వ్యవసాయ అధికారులతో 21 టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటుచేసి, తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. లూజ్ విత్తనాలు, లైసెన్స్ లేకుండా అమ్మకాలు, కాలం చెల్లిన విత్తనాల అమ్మకాలు, అధిక ధరలకు అమ్మకాలు దృష్టికి వస్తే సమాచారం ఇవ్వాలన్నారు. రైతుల సంక్షేమం కోసం సమిష్టిగా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, వ్యవసాయ శాస్త్రవేత్త డా. రవి కుమార్, జిల్లా ఉద్యానవన అధికారి వెంకట రమణ, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.#pubilctalk #khammam #telangana #government #anticorruptionmedia #

Комментарии

Информация по комментариям в разработке