ఆర్పింతు ప్రభువా నా జీవితం || Special Zion Song || Bro.Emmanuel Jayaraj

Описание к видео ఆర్పింతు ప్రభువా నా జీవితం || Special Zion Song || Bro.Emmanuel Jayaraj

పల్లవి: ఆర్పింతు ప్రభువా నా జీవితం - సామర్ధ్యము గల నీ చేతిలో
నిన్ను మహిమ పరచ అర్హ పాత్రగ చేయుము నన్ (2) "అర్పింతు"

1. నే మట్టిని నీవు కుమ్మరివి నీ సామర్థ్య హస్తముతో లేపు (2)
అయోగ్యతలన్ని తొలగించి - నీ కోర్కె చొప్పున నన్ను చేయు
నిన్ను మహిమ పరచ గొరితిన్ ప్రభువా - యోగ్య పాత్రగా చేయుము నన్ (2) "అర్పింతు"

2. నే నిష్ఫల అంజూరపు చెట్టున్ - నా చుట్టూ కంచెను కోల్పోతిన్ (2)
కానరాలేదు ఫలమేమి నాలో - వ్యర్ధపరచితిని భూమిన్
నా చుట్టూ త్రవ్వి ఎరు వేయుము ప్రభువా - ఫలమిచ్చే యోగ్యత నాకిమ్ము (2) "అర్పింతు"

3. నే అణచబడిన చిన్న చెట్టున్ - ముండ్లపొదల మధ్య పడితిన్ (2)
ధన, సుఖ ఆశల ద్వారా - అణచబడితిని నేను
నా నుండి ముండ్లను తీయుము ప్రభువా - నూరంతలుగా నే ఫలియింప (2) "అర్పింతు"

4. నా యెడల శాంతము చూపితివి - మరి యొక్క వత్సరమిచ్చితివి (2)
తోటమాలిగా నాకై వేడితివి - తప్పించితివి తీర్పు నుండి
వ్యర్థ తీగలను నరికి వేయు ప్రభువా - నే ఫలియించి నిను ఘనపరచ (2) "అర్పింతు"

Комментарии

Информация по комментариям в разработке