##

Описание к видео ##

ఆచార్య ఎన్జీ రంగా ఆశయాలకు జీవం పోస్తూ కౌలు రైతుల సంక్షేమంపై దృష్టి సారించాలి

-కౌలు రైతుల హక్కుల కోసం జాతీయ చట్టాన్ని కేంద్రం రూపొందించాలి

-ప్రభుత్వ పథకాలు, క్రెడిట్ వ్యవస్థలోకి కౌలు రైతును తీసుకురావాలి

-పిఎం -కిసాన్ సమ్మాన్ నిధి పథకం కౌలు రైతుకు అందటం లేదు

కౌలు రైతుల హక్కుల కోసం లోక్‌సభలో ప్రశంగించిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు
----------------------

స్వాతంత్ర్య సమరయోధులు, సుధీర్ఘకాలం పార్లమెంటేరియన్‌గా పనిచేసి, రైతుల సంక్షేమానికి ఉద్యమించి, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పుల తెచ్చేందుకు కృషిచేసిన రైతు బాందవుడు ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి సందర్భంగా వారి ఆశయాలను, స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తూ,, కౌలు రైతుల సంక్షేమంపై కేంద్రం దృష్టి సారించి వారికి మేలు కలిగే నిర్ణయాలకు జీవం పోయాలని టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రసంగించారు. పీఎం -కిసాన్ సమ్మాన్ నిధి పథకం నుండి దాదాపు 9 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతుండగా, అసలు సాగు చేసే కౌలు రైతుకు అర్హత, గుర్తింపు లేకపోవడం బాధాకరం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతుల సాధికారత కోసం సీఎం చంద్రబాబు నాయుడు ముందుచూపుతో కూడిన చట్టాన్ని ప్రవేశపెట్టి క్రియాశీలక చర్యలను తీసుకున్నట్లు చెప్పారు. కౌలు రైతుల హక్కుల కోసం జాతీయ చట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. తాను ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. మామూలు రైతుల మాదిరిగానే కౌలు రైతులను డిజిటల్ లో చేర్చి ప్రభుత్వ పథకాలు మరియు క్రెడిట్ వ్యవస్థలోకి అర్హత కల్పించాలన్నారు. ఈ సమస్యలను పరిగణలోకి తీసుకుని, వారికి మేలు కలిగేలా నిర్ణయాలను తీసుకోవాలని.. ఇదే ఎన్జీ రంగాకు ఇచ్చే అసలైన నివాళి అని ప్రధానమంత్రి మోడీని సభాముఖంగా అభ్యర్థించారు..... #tdpnews #telugunews #tdpparty #పల్నాటి

Комментарии

Информация по комментариям в разработке